తట్టుకోలేక ఉదయ్ కిరణ్ అభిమాని ఆత్మహత్య
విజనగరం: తన అభిమాన హీరో మరణాన్ని తట్టుకోలేక ఉదయ్ కిరణ్ అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోమటిపల్లి గ్రామంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో ఓ పాకెట్ డైరీ లభించింది.

"నా అబిమాన హీరో ఉదయ్ కిరణ్ చనిపోయాడు, ఇక ఈ జన్మ చాలు. మా మామయ్య కనకకు ఈ మోటారు బైక్ ఇచ్చేయండి. అందరికీ బై" అని డైరీలో రాసి ఉంది. గ్రామానికి చెందిన నాంగీరి సంతీష్ (19) బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.
ఆ తర్వాత గురువారంనాడు అతని మృతదేహం మామిడిచెట్టుకు వేలాడుతూ కనిపించింది. గురువారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో స్థానికులు సతీష్ మృతదేహాన్ని చూశారు. వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
మృతుడికి తల్లి కొండమ్మ, సోదరి సత్యవతి ఉన్నారు. సతీష్ మృతదేహాన్ని పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం గజపతినగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications