ఇమేజ్ చట్రంలో ఉదయ్‌కిరణ్, అన్నలాంటివాడు: భార్య
హైదరాబాద్: ఉదయ్ కిరణ్ స్టార్ ఇమేజ్ నుండి బయటపడలేకపోయారని ఆయన భార్య విషిత పోలీసుల వాంగ్మూలంలో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఉదయ్ కిరణ్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసులు కేసును దర్యాఫ్తు చేస్తున్నారు. భార్య విషిత సహా పలువురుని విచారించారు. శనివారం బంజారాహిల్స్‌లో పోలీసులు విషిత వాంగ్మూలాన్ని తీసుకున్నారు.
తన భర్త ఆత్మహత్యకు పాల్పడిన రోజున భర్తే తనను తన స్నేహితుడు (శరత్) పుట్టిన రోజు వేడుకలకు పంపించాడని ఆమె పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. శరత్ తనకు అన్నలాంటి వాడని చెప్పారు.

స్టార్ ఇమేజ్ చట్రం నుండి ఉదయ్ కిరణ్ బయట పడలేకపోయారని, చెన్నైలో జరిగిన భారతీయ సినిమా వందేళ్ల సినిమా వేడుకకు ఆహ్వానం రాలేదని మదనపడ్డాడని విషిత పోలీసులకు తెలిపారని తెలుస్తోంది. పెళ్లి సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పెద్దగా పట్టించుకోలేదని, ఆరు నెలల తర్వాత అవి తీవ్రమయ్యాయని, క్రమంగా సర్దుకుంటాయని చెప్పినప్పటికీ అలా జరగలేదన్నారు.
కాగా, తామిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, వివాహానికి ఉదయ్ కిరణ్ తండ్రి రాలేదని విషిత చెప్పిన విషయం తెలిసిందే. వివాహానికి ముందు ఉదయ్ కిరణ్‌తో ఏడాదిన్నర పాటు ప్రేమాయణం సాగించినట్టు ఆయన భార్య విషిత చెప్పింది.
పెళ్లికి ముందు తాను, ఉదయ్ కిరణ్ ఏడాదిన్నర ప్రేమించుకున్నామని, ఆ మధ్య కాలంలో తాము మనస్సు విప్పి అన్ని అంశాలపై మాట్లాడుకునేవాళ్లమని విషిత పోలీసులకు చెప్పినట్లు సమాచారం. తమ మధ్య పెళ్లికి ముందు లేదా వివాహం తర్వాత ఎలాంటి మనస్పర్థలు లేవని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications