ఉదయ్ కిరణ్ ఆత్మహత్య: కొన్ని ప్రశ్నలు, సందేహాలు
హైదరాబాద్: తెలుగు సినిమా హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య తెలుగు సినీ ప్రపంచాన్ని విషాద సముద్రంలో ముంచేసింది. ఆయన ఆత్మహత్య బయటకు వ్యక్తిగత కారణంగానే కనిపిస్తోంది గానీ దాని వెనక పనిచేసిన శక్తులు ఏమిటనేది ప్రశ్నించుకోవాల్సిందే. సిల్క్ స్మిత వంటి నటీమణుల జీవితాలు అర్థాంతంగా ముగిసిపోయి, అవి మిస్టరీగా మిగిలిపోయిన ఉదంతాలు మనకు తెలుసు. కానీ, ఒక్క హీరో ఆత్మహత్య చేసుకోవడం దానికి భిన్నమైందిగానే కనిపిస్తుంది.
ఉదయ్ కిరణ్ ఆత్మహత్య వెనక పనిచేసిన సామాజిక కారణాలు ఏమిటనేది ప్రశ్నించుకోవాల్సిన అవసరమే ఉంది. సినిమా విఫలం కావడంతో ఓ నిర్మాత హుస్సేన్ సాగర్‌లో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడం, బాగా ఆడుతున్నా ఓ పెద్ద హీరో సినిమా కోసం థియేటర్లో నుంచి తమ సినిమాను ఎత్తేశారని హైదరాబాదులోని కూకట్‌పల్లిలో ఆందోళనకు దిగడం చూస్తే సినీ ప్రపంచంలోని పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

చిన్న సినిమాలు నిలదొక్కుకుండా జరుగుతున్న ప్రయత్నాలపై, వాటికి థియేటర్లు కూడా దొరకని పరిస్థితులపై తెలుగు సినీ ప్రపంచంలో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. కానీ, ఆ సమస్యకు పరిష్కారం మాత్రం లభించడం లేదు. చిన్న హీరోలు సినిమాల్లో నిలదొక్కుకోవడానికి ఎదరువుతున్న సమస్యలపై కూడా దృష్టి పెట్టిన సందర్భాలు లేవు.
ఉదయ్ కిరణ్ 19 సినిమాల్లో నటించి కూడా అత్యంత దయనీయమైన పరిస్థితిని ఎదుర్కున్నారంటే ఆ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఉదయ్ కిరణ్‌కు అవకాశం లభించి, మధ్యలో ఆగిపోయి వెలుగు చూడని సినిమాలు ఎనిమిదో తొమ్మిదో ఉన్నాయి. అంటే, దాని వెనక పనిచేసిన శక్తులేమిటనేది ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఇక్కడ వ్యక్తులను నిందించాల్సిన అవసరం లేదు.
పెట్టుబడి ద్వారా అన్ని రంగాల్లో మాదిరిగా సినీ రంగాన్ని కూడా ఏలే శక్తులు బలోపేతం అవుతూ వస్తున్నాయి. అవకాశాలు, పెట్టుబడి, మార్కెటింగ్ కొన్ని కుటుంబాల చేతుల్లో కేంద్రీమయ్యాయనే విషయం అందరికీ తెలిసిందే. ఈ కేంద్రీకరణ వల్ల ఆ కుటుంబాల వెలుపల ఉండేవారు సినీ ప్రపంచంలో నిలదొక్కుకోవడం అంత సులభమేమీ కాదు. అలాంటి పరిస్థితినే ఉదయ్ కిరణ్ ఎదుర్కున్నారు. ఆర్థిక కారణాలు, ఒంటరితనం, అవకాశాలు లభించకపోవడం ఉదయ్ కిరణ్ ఒక్కడినే బాధపెడుతున్న విషయాలు కూడా కావు. కానీ ఉదయ్ కిరణ్ మాత్రమే ఎందుకు బలయ్యాడంటే చెప్పడం కష్టమే.
సినీ రంగంలో నిలదొక్కుకోవడానికి ఆటంకాలు ఎదురైనప్పుడు మరో రంగాన్ని ఎంచుకోవడం, జీరో నుంచి ప్రారంభం కావడం అనే విషయాన్ని ఉదయ్ కిరణ్ తన జీవితంలోకి ఆహ్వానించలేకపోయాడు. అవకాశాలు దొరకనప్పుడు చిన్న చిన్న పాత్రలకు కూడా అంగీకరించి జీవితాన్ని నెట్టుకురావడాన్ని సినీ రంగంలో చూస్తూనే ఉన్నాం. కానీ, ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి నుంచి ఉదయ్ కిరణ్‌ను బయట పడేయడానికి వెలుపలి శక్తులు మాత్రమే కాకుండా తన లోపలి శక్తులు కూడా నిరాకరించాయని చెప్పాలి. లోపలి శక్తులను సమీకరించుకుని, ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంటే ఉదయ్ కిరణ్ అంతటి తీవ్రమైన చర్యకు దిగి ఉండేవాడు కాదమో.
-
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్.. చిన్న సినిమా కాదయ్యో !! -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..!












Click it and Unblock the Notifications