ఉదయ్ కిరణ్: లేచి పడిన కెరటం, హ్యాట్రిక్ హీరో

హైదరాబాద్: తెలుగు సినీ ప్రపంచంలో అనూహ్యంగా ఎదిగిన హీరోగా ఉదయ్ కిరణ్ పేరు సంపాదించుకున్నాడు. అంతే అనూహ్యంగా పడిపోయాడు. సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన వెంటనే ఆయనకు హీరో వర్షిప్ వచ్చేసింది. ఆ తర్వాత ఆయనకు అవకాశాలు కూడా కరువయ్యాయి. ఈ స్థితిలో తీవ్రమైన డిప్రెషన్‌కు గురై 33 ఏళ్ల ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నారు.

తన ఇంట్లో ఉరేసుకున్న ఉదయ్ కిరణ్ వార్త విని తెలుగు ప్రజలు అవాక్కయ్యారు. ఉదయ్ కిరణ్ మానసిక సంక్షోభానికి గురయ్యారని, హీరోగా తనకు అవకాశాలు లేకపోవడంపై తీవ్రంగా మనస్తాపానికి గురవుతూ వచ్చారని ఆయన మిత్రులు కూడా చెబుతున్నారు.

 Uday Kiran

తన భార్య విషిత ఓ బర్త్ డే పార్టీకి వెళ్లిన సమయంలో ఉదయ్ కిరణ్ తన మిత్రులకు కొందరి ఎస్ఎంఎస్ సందేశాలు పంపినట్లు తెలుస్తోంది. తాను తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నట్లు ఆ సందేశాలు పంపించాడని అంటున్నారు. తాను చేసిన కాల్స్‌కు ఉదయ్ కిరణ్ నుంచి సమాధానం రాకపోవడంతో విషిత ఇంటికి వచ్చింది. చూసేసరికి, అతను ఉరేసుకుని కనిపించాడు. ఆమె పోలీసులకు సమాచారం అందించింది.

పోలీసులు ఉదయ్ కిరణ్ మొబైల్ ఫోన్‌ను, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన భర్త మనస్తాపానికి గురయ్యాడని, తెలుగు సినీ రంగం గుర్తించకపోవడంతో మనోవేదనకు గుర్యయాడని విషిత పోలీసులకు చెప్పినట్లు సమాచారం. తేజ దర్శకత్వం వహించిన చిత్రం సినిమా ద్వారా ఉదయ్ కిరణ్ ఆరంగేట్రం చేశాడు. ఆ సినిమా విజయం సాధించింది. దాని తర్వాత వచ్చిన నువ్వు నేనే, మనసంతా నువ్వే సినిమాలు కూడా విజయం సాధించాయి. దీంతో ఉదయ్ కిరణ్‌కు హ్యాట్రిక్ హీరోగా పేరు వచ్చింది.

2001లో అతనికి ఫిలిం ఫేర్ ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. ఈ అవార్డు అందుకున్న పిన్న వయస్కుడు ఆయనే. ఆయన మొత్తం 19 సినిమాలు చేశారు. ఇందులో మూడు తమిళ సినిమాలున్నాయి. నీ స్నేహం, కలుసుకోవాలని వంటి సినిమాలు చేశారు. దీంతో రోమాంటిక్ హీరోగా అతనికి పేరు పడేపోయే పరిస్థితి వచ్చింది. దాని నుంచి బయటపడాలని కూడా ఆయన అనుకున్నట్లు చెబుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+