ఎందుకు పెళ్లి చేసుకున్నాడో: ఉదయ్ కిరణ్ భార్య
హైదరాబాద్: హీరో ఉదయ్ కిరణ్‌ను తాను అనవసరంగా పెళ్లి చేసుకున్నాని, ఇప్పుడు తన జీవితం ఒంటరిగా మిగిలిపోయిందని అతని భార్య విషిత ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఉదయ్ ఆత్మహత్య కేసుపై దర్యాప్తు చేస్తున్న బంజారాహిల్స్ పోలీసులు అతని భార్య విషితను గురువారం సాయంత్రం మరోసారి విచారించారు. ఈ సందర్బంగా ఆమె పోలీసులు కొన్ని విషయాలు చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
ఉదయ్ కిరణ్ ఎంతసేపూ తాను స్టార్ హీరోనన్న చట్రంలో బిగుసుకుపోయాడని, దాన్నుంచి బయటకు రాలేక తరచూ సతమతమవుతుండేవాడని, ఎన్నిసార్లు ఆయనకు నచ్చజెప్పినా లాభం లేకపోయిందని విషిత ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

సినిమాల్లో అవకాశాలు లేకపోవడం, సహచర నటులు మాట్లాడకపోవడం, సినీ కార్యక్రమాలకు పిలవకపోవడం, వందేళ్ల సినిమా పండుగకు సైతం ఆహ్వానం అందకపోవడం, ఇవన్నీ ఉదయ్‌పై ప్రభావం చూపాయని ఆమె చెప్పారు. విలువైన స్థలాలు చాలానే వున్నా వాటిని అమ్మి పరిస్థితులను చక్కదిద్దుకోవడంలో విఫలమయ్యాడని చెప్పారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు తనకు సినిమా అవకాశాలు లేకుండా చేస్తున్నారని గ్రహించిన ఉదయ్ కిరణ్ మనం చెన్నయ్‌కి వెళ్దామని, అక్కడ సినిమా అవకాశాల్లో ప్రయత్నిద్దామని చెప్పేవాడని, దాంతో అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నామని ఆమె చెప్పిందని అంటున్నారు.
నెలకు రూ.25 వేల అద్దెతో ఓ ఇంటిని తీసుకుని 3 నెలల అడ్వాన్స్ కూడా చెల్లించామని, కానీ ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని విషిత పోలీసులకు తెలిపింది.












Click it and Unblock the Notifications