పంచె కట్టులో మెరిసిన జగన్, సతీ సమేతంగా ఉగాది వేడుకలు

తెలుగువారి కొత్త ఏడాది 'ఉగాది' పర్వదినాన్ని పురస్కరించుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి, వైయస్ భారతి దంపతులు ఈ వేడుకల్లో పాల్గొని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సాంప్రదాయబద్ధంగా పంచెకట్టు, భుజాన కండువాతో విచ్చేసిన జగన్ దంపతులకు వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

ఉగాది వేడుకల కోసం పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక పూజా మందిరం వంటి వేదికను ఏర్పాటు చేశారు. శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం, ప్రముఖ సిద్ధాంతి పిడపర్తి భాస్కర సుబ్రమణ్యశాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. పరాభవ నామ సంవత్సరంలో గ్రహగతులు, వర్షపాతం మరియు రాష్ట్ర భవిష్యత్తుపై ఆయన అంచనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు.

Ugadi 2026 At YSRCP Office YS Jagan Mohan Reddy Participates In Traditional Panchekattu Greets AP People

వేద ఆశీర్వచనం

పంచాంగ శ్రవణం ముగిసిన తర్వాత వేద పండితులు జగన్ దంపతులకు వేద ఆశీర్వచనం ఇచ్చి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా జగన్ సిద్ధాంతి పిడపర్తి భాస్కర సుబ్రమణ్యశాస్త్రితో పాటు వేద పండితులను దుశ్శాలువలతో ఘనంగా సన్మానించారు.

ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు

కార్యక్రమం అనంతరం జగన్ మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ, పార్టీ శ్రేణులకు, అభిమానులకు హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ పరాభవ నామ సంవత్సరం అందరి జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని ఆయన ఆకాంక్షించారు. వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జగన్ ఉగాది శుభాకాంక్షలు పంచుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+