చంద్రబాబు మా హీరో: ప్రశంసలతో ముంచెత్తిన ఉమా భారతి

కేంద్ర మంత్రి ఉమా భారతి ఎపి సిఎం చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తారు. చంద్రబాబును తమ హీరోగా అభివర్ణించారు. ఆయనలా పనిచేయాలని కోరుకుంటామని అన్నారు.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి ప్రశంసలతో ముంచెత్తారు. చంద్రబాబు తమ హీరో అని అన్నారు. చంద్రబాబు పనిచేసినంత వేగంగా తాము పనిచేయలేకపోతున్నామనే బాధ కలుగుతుందని, ఆయన పనిచేయాలని తాము కోరుకుంటామని ఉమా భారతి అన్నారు.

ప్రతిష్ఠాత్మకమైన పోలవరం ప్రాజెక్టుకు నాబార్డ్ మొదటి విడత రుణం విడుదల చేసే సంధర్భంగా హామిటేట్ సెంటర్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లి, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.

వారంతా ఒకరినొకరు పొగడ్తలతో ముంచేసుకున్నారు. ప్రధాని మోడీ, పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడులపై కూడా ఉమాభారతి ప్రశంసలు కురిపించారు. తాను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు, నరేంద్రమోడీ గుజరాత్‌కు సిఎంలుగా ఉండేవారని, వారు ఎలా పని చేస్తున్నారో తెలుసుకుని తాను కూడా అలా పని చేయాలనుకునేదానినని ఉమాభారతి చెప్పారు.

బాబు తపన తెలుసు..

బాబు తపన తెలుసు..

పోలవరం ప్రాజెక్టు కోసం చంద్రబాబు పడే తపన తనకు బాగా తెలుసునని ఉమా భారతి అన్నారు. ఇక కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని ఆమె గొడుగుతో పోల్చారు. వెంకయ్యనాయుడు ఒక గొడుగు లాంటి వారు, తమ పెద్దన్న, ఆయన పోలవరం కోసం ఎంతో ఆరాటపడుతున్నారని, తమను ఎంతో ప్రోత్సాహిస్తున్నారని ఆమె అన్నారు.

తెలంగాణకు అందుకే వెళ్లలేకపోయా...

తెలంగాణకు అందుకే వెళ్లలేకపోయా...

చంద్రబాబు తనను పలుమార్లు ఏపికి ఆహ్వానించారని, పోలవరం మూలంగానే ఏపి, తెలంగాణాలకు వెళ్లలేకపోయానని ఉమా భారతి అన్నారు. అక్కడికి వెళ్లగానే పోలవరం గురించి అడిగితే ఏం చెప్పాలనే వేదన తనను సతమతచేసేదని. ఇప్పుడు రుణం విడుదల అయినందున చంద్రబాబు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఏపికి వెళతానని మంత్రి అన్నారు.

చంద్రబాబు వేగం కారణంగా ఇలా..

చంద్రబాబు వేగం కారణంగా ఇలా..

చంద్రబాబు ఎంత వేగంగా పని చేస్తున్నారో అంత వేగంగా తాము ఆయనతో సహకరించటం లేదనే బాధ తనకు ఉండేదని ఉమా భారతి అన్నారు. కేంద్రమంత్రి సుజనా చౌదరి తరచు తన కార్యాలయానికి వచ్చి పోలవరం గురించి అడిగేవారని, తానెప్పుడు ఆర్థిఖ శాఖకు వెళ్లి రుణం గురించి మాట్లాడుతానా అని చూసేవారని ఆమె చెప్పారు. పోలవరంతో పాటు మొత్తం 99 నీటి పారుదల ప్రాజెక్టులకు రుణం ఇప్పించటంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అత్యంత కీలకపాత్ర నిర్వహించారని ఉమాభారతి తెలిపారు.

చంద్రబాబుకు కీలక పాత్ర...

చంద్రబాబుకు కీలక పాత్ర...

నదుల అనుసంధానం ప్రక్రియలో చంద్రబాబుకు ప్రముఖ పాత్ర కల్పిస్తామని ఉమా భారతి ప్రకటించారు. బాబు నదుల అనుసంధానంతోపాటు రాష్ట్రంలోని నదుల ఇంట్రాలింకింగ్ కూడా చేస్తున్నారని ఆమె ప్రశంసించారు. మరోవైపు చంద్రబాబు ప్రధాని మోడీ, ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు, ఉమాభారతితోపాటు తమ పార్టీకి చెందిన కేంద్రమంత్రి సుజనా చౌదరిని ప్రశంసలతో ముంచెత్తారు.

కేక్ కట్ చేసిన బాబు

కేక్ కట్ చేసిన బాబు

సమావేశం తర్వాత చంద్రబాబునాయుడు కేక్ కట్ చేసి ఉమాభారతి, వెంకయ్యనాయుడుకు తినిపించి పోలవరం మొదటి విడత రుణం విడుదల సందర్భంగా అభినందనలు తెలిపారు. ఉమాభారతి ఆప్యాయంగా చంద్రబాబునాయుడును హత్తుకున్నారు. టిడిపి కార్యాలయ కార్యదర్శి సత్యనారాయణ ముందే తెచ్చి పెట్టిన కేక్‌ను చంద్రబాబునాయుడు కట్ చేసి అందరికి తినిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+