చంద్రబాబు తో పోరాటంలో సీఎం జగన్ కు అక్కడే మైనస్ - ఉండవల్లి..!!
చంద్రబాబును ఎదుర్కొనే విషయంలో సీఎం జగన్ కు ఉండవల్లి కీలక సూచన చేసారు.
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయంగా కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సూచన చేసారు. చంద్రబాబు పాదయాత్రలు..అడ్డంకుల పైన ఉండవల్లి స్పందించారు. అక్కడే జగన్ మైనస్ అవుతున్నారని కొత్త విశ్లేషణ చేసారు. జగన్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టిన అంశాన్ని ఉండవల్లి ప్రస్తావించారు. రాష్ట్ర విభజనకు రాజ్యసభ లో ఆమోదం పొందన ఈరోజు దుర్దినంగా ఉండవల్లి పేర్కొన్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సలహా ఇచ్చారు.

జగన్ పై కేసులు పెద్ద తప్పు
నాడు కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ ను జైలులో పెట్టటం పెద్ద తప్పని ఉండవల్లి చెప్పుకొచ్చారు. జనంలో అదే ఆగ్రహానికి కారణమైందన్నారు. వైఎస్ కుమారుడిని జైలులో పెడతారా అంటూ జగన్ కు జనం మద్దతు గా నిలిచారని చెప్పుకొచ్చారు. అదే జగన్ కు కలిసి వచ్చిందని విశ్లేషించారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు.. ముఖ్యమంత్రి జగన్ తిరిగి అధికారం కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటారన్నారు. ప్రతిపక్షం ఇలాగే చేస్తుందని.. ప్రభుత్వం అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్న వారిని అడ్డుకుంటే అది ప్రభుత్వంలో ఉన్న వారికి మైనస్ అవుతుందని ఇది జగన్ గుర్తించాలని ఉండవల్లి సూచించారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో అనపర్తి వద్ద చంద్రబాబును అడ్డుకోవటం పైన ఉండవల్లి స్పందించారు.

ప్రభుత్వానికి మైనస్ అవుతుంది
రాజకీయాల్లో హత్యలు ఉండవని ఆత్మహత్యలే ఉంటాయని వ్యాఖ్యానించారు.జీవో నెంబర్ 1 హైకోర్టులో విచారణ పూర్తయిందని..తీర్పు రావాల్సి ఉందన్నారు. అప్పులు చేస్తున్నారంటూ తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుతున్న కేంద్రం ..ముందు వాళ్లు చేసిన అప్పుల గురించి శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసారు. కోటి 50 లక్షల కోట్లు కేంద్రం అప్పులు చేసిందన్నారు. దేశ చరిత్రలో ఈ స్థాయిలో అప్పులు ఎప్పుడూ చేయలేదన్నారు. అంతర్జాతీయంగా అన్ని ధరలు తగ్గుతున్న క్రమం లో ఈ స్థాయిలో అప్పులు ఎందుకని ప్రశ్నించారు. జాతీయ నేతగా మారిన కేసీఆర్ ఏపీలో ఓటర్లను ఆకట్టుకోవాంటే ఏపీకి క్లియర్ చేయాల్సిన అంశాల పైన ఫోకస్ చేయాలని సూచించారు.
కేసీఆర్ కు ఉండవల్లి సూచన
ఏపీకి చెందిన బీసీలకు తెలంగాణలో బీసీ జాబితా నుంచి తొలిగించారని..తిరిగి పునరుద్దరించాలని ఉండవల్లి డిమాండ్ చేసారు. పార్లమెంట్ లో అసలు రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందలేన్నారు. విభజన అంశం పైన తాను వేసిన పిటీషన్ ఈ నెల 22న విచారణకు వస్తుందని వెల్లడించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం పైన నాడు చంద్రబాబు స్పందించ లేదన్నారు. తాను సీఎం జగన్ ను కలవటానికి ప్రయత్నిస్తే అవకాశం దక్కలేదని ఉండవల్లి చెప్పుకొచ్చారు. తాను వైఎస్సార్ నుంచి ప్రస్తుతం లోకేష్ వరకు అందరి పాదయాత్రలు చూసానని చెప్పారు.












Click it and Unblock the Notifications