జగన్ కు ఉండవల్లి కీలక సూచన - అలా చేసి, తిరిగి అధికారంలోకి..!!
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఎన్నికల ఫలితాల పైన ఇంకా విశ్లేషణలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు తన పాలన ప్రారంభించారు. తన మంత్రులకు శాఖల కేటాయింపు కసరత్తు చేస్తున్నారు. జగన్ ఓటమి తరువాత పార్టీ నేతలతో సమీక్షలు చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో రాజకీయాలు..వైసీపీ ప్రతిపక్ష పాత్ర పైన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తి కర విశ్లేషణ చేసారు.
తమిళనాడు తరహాలో
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. 11 స్థానాలే గెలిచిన వైసిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి పోరాడాలని సూచించారు. రాష్ట్రంలో తమిళనాడు తరహా రాజకీయాలు మొదలయ్యాయని వ్యాఖ్యానించారు. కరుణానిధికి ఏడు స్థానాలు వచ్చిన, జయలలిత నాలుగు స్థానాలకే పరిమితమైన విషయాన్ని గుర్తు చేసారు. అయినా, వారు సక్రమంగా ప్రతిపక్ష పాత్ర నిర్వహించి అధికారంలోకి వచ్చారని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రతిపక్ష పాత్ర సమర్దవంతంగా పోషిస్తే అలాంటి అవకాశం దక్కే ఛాన్స్ ఉంటుందని పేర్కొన్నారు.

చంద్రబాబుకు ఛాన్స్
గతంలో ఉల్లిపాయ ధరపెరిగి ఢిల్లీలో ప్రభుత్వం పడిపోయిందిని ఉండవల్లి గుర్తు చేసారు. రాష్ట్రంలో మధ్యం ధరలు పెరుగుదలే వైసిపి ఓటమికి కారణంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ లకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకు వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫలితాలతోనే కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పారు. బిజెపి పొత్తు లేకపోయినా రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమీ ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేసారు.
ఇదీ చేయాల్సింది
ఓటమి పొత్తు లేకపోతే ప్రధాని మోడీకి నష్టమని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్రానికి రావలసినవి రాబట్టాలని సూచించారు. వీరు ఏమి చెప్పితే అదే జరుగుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, రైల్వే జోన్. ఏర్పాటు సాధించాలని ఉండవల్లి సూచించారు. తాజాగా జగన్ సైతం పార్టీ ఎమ్మెల్సీలతో సమీక్ష సమయంలో ఇలాంటి వ్యాఖ్యలే చేసారు. కేంద్రంలో అవకాశం ఉన్నా చంద్రబాబు ప్రత్యేక హోదా కోరటం లేదన్నారు. ఇప్పుడు ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications