జగన్ ఇష్టమే, బాబు వ్యూహాలు మూమూలుగా ఉండవు, వారిమధ్య తేడా అదే: ఉండవల్లి ఆసక్తికరం

హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మధ్య తేడాలను చెబుతూ మాజీ పార్లమెంటుసభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Recommended Video

    చంద్రబాబు,జగన్ పై విరుచుకుపడ్డ ఉండవల్లి

    ఓ టీవీ చానల్ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉండవల్లి అరుణ్ కుమార్.. ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల సమయం ఉందని గుర్తు చేశారు. ఆ సమయానికి ఏదైనా జరగవచ్చని చెప్పారు.

    వ్యూహాల్లో చంద్రబాబు దిట్ట

    వ్యూహాల్లో చంద్రబాబు దిట్ట

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది కూడా సమయం లేని ప్రస్తుత పరిస్థితుల్లో వైయస్ జగన్‌కు చంద్రబాబుతో పోలిస్తే అడ్వాంటేజ్ అధికంగా ఉందని అన్నారు. ఎలక్షన్ మేనేజ్‌మెంట్‌లో చంద్రబాబు సిద్ధహస్తుడని, స్వయంగా వ్యూహాలను రచించగల దిట్టని చెప్పారు.

    2014లోనూ బాబు తన వ్యూహాలతో..

    2014లోనూ బాబు తన వ్యూహాలతో..

    జగన్ వద్ద ఎలక్షన్ మేనేజ్‌మెంట్ శక్తి లేదని, ఆయన వద్ద ఆ పనిని సమర్థవంతంగా చేసిపెట్టగల వారు ఎవరైనా ఉన్నారా? అన్న విషయం తనకు తెలియదని ఉండవల్లి చెప్పారు. 2014 ఎన్నికలకు ముందు సైతం జగన్‌కు అడ్వాంటేజ్ ఉందని అందరూ భావించారని, అయితే, చివరి నెలన్నర రోజులూ చంద్రబాబు పన్నిన వ్యూహాలు ఫలితాలను మార్చి ఆయనకు అనుకూల ఫలాన్నిచ్చాయని గుర్తు చేశారు.

    జగన్ అంటే అభిమానం

    జగన్ అంటే అభిమానం

    ‘చంద్రబాబును ఎదుర్కునే సత్తా జగన్‌కు లేదు' అని తాను అన్నట్టు మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమని ఉండవల్లి స్పష్టం చేశారు. తనకు సంబంధించినంత వరకూ తమ నేత రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డిగా అభిమానం ఉందని ఉండవల్లి వ్యాఖ్యానించారు.

    జగన్ వస్తే ఆనందమే

    జగన్ వస్తే ఆనందమే

    ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ నేతల్లో తక్కువ మంది టీడీపీలో, ఎక్కువమంది వైసీపీలో ఉన్నారని.. అందుకే జగన్ గెలిస్తే తాను కూడా ఆనందిస్తానని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. అంతేగాక, తనకేమైనా అవసరం ఉంటే తన పనులు డైరెక్టుగానే చేయించుకుంటానని తెలిపారు. చంద్రబాబు వస్తే సీక్రెట్ చేయించుకోవాల్సి వస్తుందని అన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+