బాబూ! సమర్థుడనుకొని ఓటేస్తే ఏం చేశావ్, మోడీకి నచ్చలేదా: ఉండవల్లి, చిరు నో అన్నారు

న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా విషయంలో బిజెపి - టిడిపి కూటమి పైన రాజమండ్రి మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. చంద్రబాబు సమర్థుడనుకొని ప్రజలు గెలిపించారని, మోడీని పదేపదే కలిసి ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు.

బిజెపి బలపడుతుందని చంద్రబాబు భయపడుతున్నారన్నారు. పదేళ్లు ప్రత్యేక హోదా బిజెపి - టిడిపి కూటమి ఇచ్చిన హామీనే అని చెప్పారు. ప్రత్యేక హోదా అనేది ఏపీ ప్రజల సెంటిమెంటు అన్నారు. దానిని తప్పకుండా నెరవేర్చాల్సిందే అన్నారు. ఎన్నివేల కోట్లు ఇచ్చినా ప్రత్యేక హోదా సెంటిమెంట్ పోదన్నారు.

చంద్రబాబు నచ్చలేదా

ప్రత్యేక హోదా పైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులు మభ్యపెడుతున్నారన్నారు. ఎవరు అడిగారని బీహార్ వెళ్లి ప్రధాని మోడీ భారీ ప్యాకేజీ ప్రకటించారన్నారు. ప్రధాని మోడీకి ఏది నచ్చిదే అది చేస్తారా అన్నారు. చంద్రబాబు నచ్చకుంటే చెప్పాలన్నారు.

Undavalli flays Venkaiah, Chandrababu on special status

ప్రత్యేక హోదా పైన మీరు తోకముడిస్తే చరిత్ర క్షమించదని బిజెపి - టిడిపిపై మండిపడ్డారు. పదేపదే ప్రధాని మోడీని ఏపీ సీఎం చంద్రబాబు కలిసి సాధించింది ఏమిటని నిలదీశారు. తమను సస్పెండ్ చేసి తెలంగాణ ప్రకటించిన దాని కంటే హోదా ఇవ్వకపోవడం మరీ దారుణమన్నారు.

ప్రత్యేక హోదా పైన చంద్రబాబు డిఫెన్స్‌లో పడ్డారని ధ్వజమెత్తారు. చంద్రబాబు సమర్థుడు అనుకొని ఏపీ ప్రజలు ఓట్లు వేశారన్నారు. ఇప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రజలు క్షమించరన్నారు. చట్టంలోని అంశాలను కూడా సాధించుకోలేకపోతున్నామన్నారు.

చంద్రబాబు నచ్చకే మోడీ ఏమీ చేయడం లేదు అనుకోవాలా అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా బిజెపి స్వయంగా ఇచ్చిన హామీనే అన్నారు. హోదాను నాడు వైసిపి, కాంగ్రెస్, టిడిపి లేదా ఇతర పార్టీలు అడగలేదన్నారు. విభజన సమయంలో రూ.10వేల కోట్లు ఇవ్వాలన్న వారు ఇప్పుడు రూ.2,500 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు.

వెంకయ్య గట్టిగా అడిగారు

విభజన సమయంలో వెంకయ్య నాయుడు రాజ్యసభలో మాట్లాడి ఫోకస్ అయ్యారన్నారు. ప్రతిపక్షంలో ఉండి విభజన బిల్లును సమర్థించి, ఇప్పుడు హామీలు నెరవేర్చకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నారు. హోదా కోసం వెంకయ్య గంటలపాటు రాజ్యసభలో నిలదీశారన్నారు.

బిల్లు ఒప్పుకోమని చిరంజీవి చెప్పారు

విభజన సమయంలో బిల్లును అంగీకరించేది లేదని నాడు కేంద్రమంత్రిగా ఉన్న చిరంజీవి స్పష్టంగా చెప్పారన్నారు. కానీ, నాటు అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. కేంద్రమంత్రి అయి ఉండి బిల్లును ఎలా వ్యతిరేకిస్తారని ప్రశ్నించారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+