Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాబు అరెస్ట్ తో జరిగేదిదే - పవన్ పొత్తుపై తొందర పడ్డారు: ఉండవల్లి..!!

స్కిల్ కేసు..చంద్రబాబు పాత్ర..17ఏ పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. సీబీఐ విచారణ కోరటంలో తప్పేంటని ప్రశ్నించారు. సీబీఐ విచారణ సీఎం జగన్.. చంద్రబాబు ఇద్దరికీ మేలు చేస్తుందన్నారు. చంద్రబాబు రిమాండ్ విధించగానే బెయిల్ కోరకుండా...క్వాష్ కోరటం ఏంటని ప్రశ్నించారు. 17ఏ అమలు చేస్తే జగన్ పైనా కేసులు ఉండవన్నారు. స్కిల్ స్కాంలో చంద్రబాబు పీఏకు డబ్బులు వెళ్లాయని చెప్పుకొచ్చారు.

సీబీఐ విచారణ ద్వారా: స్కిల్ స్కాం పై సీబీఐ విచారణ కోరుతూ ఉండవల్లి హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేసారు. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు 44 మందికి నోటీసులు జారీ చేస్తూ కేసు నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసు విచారణ సమయంలో సీబీఐకి ఇవ్వటానికి ప్రభుత్వానికి అభ్యంతరం లేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు స్పష్టం చేసారు. ఉండవల్లి ఈ కేసు సీబీఐ కు ఇవ్వాలని కోరటం పైన టీడీపీ నేతలు మండి పడ్డారు.

Undavalli Made interesting comments on Chandra Babu Skill scam and TDP

ఉండవల్లిని టార్గెట్ చేసారు. తన పైన చేసిన వ్యాఖ్యలపై ఉండవల్లి సీరియస్ గా స్పందించారు. చంద్రబాబుకు ఈ స్కాంలో డబ్బులు ముట్టినట్లు ఆధారాలు లేవనేది వాస్తవం అని చెబుతూ..ఏ రాజకీయ నాయకుడు తన మీదకు ఏ అంశాన్ని తెచ్చుకోరని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పీఏ అకౌంట్ లోని డబ్బులు వెళ్లాయని వెల్లడించారు.

పొత్తు తొందరపాటు: చంద్రబాబుతో పవన్ పొత్తు తొందరపాటు చర్యగా ఉండవల్లి పేర్కొన్నారు. తనను పవన్ అడిగి ఉంటే కొద్ది రోజులు ఆగమని చెప్పే వాడినని వ్యాఖ్యానించారు. ఇప్పుడు టీడీపీ, వైసీపీలో రెండు పార్టీల్లొ ఒక వైపు ఉండేలా పరిస్థితులు మారాయని చెప్పుకొచ్చారు. స్కిల్ కేసులో కొన్ని ఫైల్స్ మాయమయ్యాయని..అవి టీడీపీ ప్రభుత్వంలోనా.. వైసీపీ ప్రభుత్వంలోనా అనేది స్పష్టత రావాల్సి ఉందన్నారు.

Undavalli Arun Kumar On Janasena Alliance With TDP

సీబీఐ విచారణ ద్వారా చంద్రబాబు..జగన్ ఇద్దరికీ మంచిదని వివరించారు. కేబినెట్ నిర్ణయాల్లో చంద్రబాబును విచారణ గురించి ప్రశ్నిస్తున్నారని..అసలు కేబినెట్ నిర్ణయాలను ప్రశ్నించకూడదని అనుకులంటే జగన్ పైన కేసులే ఉండవని ఉండవల్లి వివరించారు. 17ఏ వర్తిస్తే ఇప్పుడు టీడీపీ, పవన్ చెబుతున్నట్లుగా అసలు జగన్ పైన కేసులకే అవకాశం లేదంటూ కీలక వ్యాఖ్యలు చేసారు.

ఆధారాలతోనే రిమాండ్: గతంలో పలు రాష్ట్రాల్లో కేసులు..జైలు ఎదుర్కొన పలువురు నేతలు బయటకు వచ్చి ఎన్నికల్లో గెలిచారని ఉండవల్లి గుర్తు చేసారు. చంద్రబాబు పైన ఆధారాలు ఉంటేనే రిమాండ్ కు పంపారని... ఆ వెంటనే బెయిల్ కు వెళ్లకుండా కేసు కొట్టేయమని కోరటం ఏంటని ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా కోర్టులు రిమాండ్ విధించవని..కోర్టులు పూర్తి ఆధారాలతోనే నిర్ణయాలు తీసుకుంటాయన్నారు.

చంద్రబాబు ఆరోగ్యం ఇబ్బందిగా ఉంటే..సరైన విధానంలో వెళ్తే ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తుందని చెప్పారు. చంద్రబాబు జైలుకు వెళ్లాలని వైసీపీ నేతలు కోరుకోరని.. ఆయన కారణంగా జైలుకు వెళ్లిన వారికి మాత్రం కోపం ఉంటుందని ఉండవల్లి చెప్పుకొచ్చారు. చంద్రబాబు బెయిల్ కు సమస్య ఉండే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+