వారే 'మోడీ రైట్' అంటారు, మన్మోహన్ నుంచి ఈ దారుణ పదాలు విన్లేదు: ఉండవల్లి
నోట్ల రద్దు అంశంపై మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
న్యూఢిల్లీ: నోట్ల రద్దు అంశంపై మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన పెద్దలు అందరూ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీని కీర్తిస్తున్నారని, ఆయన నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారన్నారు.
రూలింగ్ పార్టీ ట్రాక్‌లో చిక్కుకున్న విపక్షాలు పార్లమెంటులో అనవసర రాద్ధాంతాలు చేస్తున్నాయన్నారు. ఇకనైనా వాస్తవాన్ని గ్రహించి చర్చకు సహకరించి ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షాలకు ఆయన హితవు పలికారు.
పేదవాడిని కాపాడుతూ పెద్దవాడి దగ్గర అన్యాయంగా ఉన్న డబ్బును ఈ ప్రభుత్వం తీసుకురాగలదు అన్న నమ్మకం ప్రజల్లో కలగాలన్నారు. జనాలకు కావాల్సింది ఇదేనని చెప్పారు. కానీ సర్కార్ మాత్రం ఈ విషయాలను పక్కన పెట్టిందన్నారు.

అంబానీ, ఆదానీ ప్రధాని మోడీని, కేంద్రం నిర్ణయాన్ని సమర్షిస్తారని ఎద్దేవా చేశారు. ఈ దేశంలో డబ్బులు ఎగ్గొట్టిన కోటీశ్వరులందరూ వరుసలో నిలబడి మోడీ గారు రైట్.. మోడీ గారు రైట్ అని చెబుతున్నారని, ఇది విడ్డూరం అన్నారు.
ఇంత దారుణ పదాలు మన్మోహన్ నోటి వెంట వినలేదు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి ఉండవల్లి మాట్లాడారు. మన్మోహన్ ప్రపంచం మొత్తం గౌరవించే ఎకనమిస్ట్ అన్నారు. నోట్ల రద్దుపై ఆయన మాట్లాడుతూ 'మాన్యుమెంటల్ డిజాస్టర్, లీగలైజ్డ్ లూటింగ్' అన్నారని, ఇంత దారుణమైన పదాలు మన్మోహన్ నోటివెంట విన్లేదన్నారు. ఎంపీలు ఎవరు కూడా అధికార పార్టీ ట్రాప్‌లో పడవద్దన్నారు. ఈ నాలుగు రోజులైనా చర్చకు తప్పించుకోవద్దన్నారు.
కాంగ్రెస్‌కు జైట్లీ ప్రశ్న
పెద్దనోట్ల రద్దు అనంతరం దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని అధిగమించేందుకు ప్రభుత్వం అన్నివిధాలా చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ గురువారం వెల్లడించారు. నోట్లరద్దు అంశంపై చర్చను విపక్షాలు అడ్డుకుంటున్నాయన్నారు.
గురువారం ఆయన లోకసభలో మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని తొలగించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. డిసెంబర్ 30 వరకు ప్రజల ఇబ్బందుల్ని తగ్గించేందుకు కృషి చేయాలని ప్రధాని మోడీ చెప్పారన్నారు. గతంలో పదేళ్లపాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ అవినీతి నిర్మూలించే దిశగా ఒక్క అడుగైనా ముందుకు వేసిందా అని నిలదీశారు.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications