ఇంట్లో ఉరేసుకుని హైదరాబాద్‌లో టెక్కీ ఆత్మహత్య

Unemployed man commits suicide
హైదరాబాద్: ఆర్థిక సమస్యలతో విసిగిపోయిన 28 ఏళ్ల వ్యక్తి హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. బాలానగర్‌లోని తన నివాసంలో అతను సోమవారంనాడు ఉరేసుకుని మరణించి శవంగా కనిపించాడు. మృతుడిని బాలానగర్‌లోని కళ్యాణ్ నగర్‌లో నివాసం ఉంటున్న ఆర్ మనోజ్ కుమార్‌గా గుర్తించారు.

ఇంట్లోంచి దుర్వాసన వస్తుండడంతో పొరుగువారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శవం కుళ్లిపోవడంతో దుర్వాసన వెలువడుతూ వచ్చింది. తాడుతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని మనోజ్ కుమార్ శవం కనిపించింది. సూసైడ్ నోట్ ఏదీ లేదు.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన మనోజ్ కుమార్ కొద్ది నెలల క్రితం ఉద్యోగం కోల్పోయాడు. ఆరు నెలలుగా అతను ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు. భార్య ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లింది. ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియవని పోలీసులు అంటున్నారు.

మనోజ్ ఆర్థిక సమస్యలతో సతమతవుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+