ఇంక హీరోయిన్ అవలేనని...పెళ్లి చెయ్యబోతున్నారని...ఆత్మహత్య
అనంతపురం జిల్లా: తాను హీరోయిన్ అవ్వాలని ఎన్నో కలలు కన్న ఓ టీనేజ్ బాలిక , తల్లిదండ్రులు పెళ్లి చెయ్యాలని నిర్ణయించడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. తన కల నెరవేరదని మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడింది. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...
గుంతకల్లులో గంగానగర్‌కు పెద్దన్న, నీలావతి దంపతుల కుమార్తె ప్రవీణ (17)కు సినిమా హీరోయిన్ కావాలన్న కోరిక బలంగా ఉండేది. తల్లిదండ్రులు, కుటుంబీకులు మాత్రం ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో తాను హీరోయిన్ అయ్యే అవకాశం లేకుండా పెళ్లి చేసేస్తున్నారన్నమనస్తాపంతో బుధవారం ప్రవీణ ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

బాలిక ఆత్మహత్య సమాచారం లో వన్ టౌన్ ఎస్‌ఐ వెంకట ప్రసాద్...ఘటనా స్థలానికి చేరుకొని యువతి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టుం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications