అనంతలో లారీ డ్రైవర్‌పై తుపాకీ కాల్పుల కలకలం, పరిస్థితి విషమం
హైదరాబాద్: అనంతపురం జిల్లా ధర్మవరం మండలం సీతారాంపల్లిలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. బుధవారం తెల్లవారుజామున బీజాపూర్ ప్రాంతానికి చెందిన ఓ లారీ డ్రైవర్ రమేష్‌పై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు.
దగ్గర నుంచి గురి చూసి కాల్చడంతో లారీ డ్రైవర్‌పై శరీరంలోకి మాడు బుల్లెట్లు దూసుకెళ్లాయి. బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కేఏ28సీ 3057 నెంబర్ లారీని సినీ ఫక్కీలో కారులో వెంబడించి నిందితులు కాల్పులకు తెగబడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటన్ లారీ డ్రైవర్ రమేశ్‌ను బెంగుళూరులోని సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులు దోపిడీ దొంగలు అయి ఉంటారని పోలీసుు భావిస్తున్నారు.

అంతేకాదు లారీ డ్రైవర్ సరుకును అన్‌లోడ్ చేసి డబ్బు తీసుకువెళుతున్నాడని గమనించిన దుండగులు ఈ ఘటనకు పాల్పడి వుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
పాతపట్నంలో పేలిన గ్యాస్ సిలిండర్
శ్రీకాకుళం జిల్లాలో బుధవారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. జిల్లాలోని పాతపట్నం మండలం గంగువాడలోని ఓ ఇంట్లో ఈ సిలిండర్ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు తెలిపారు. ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications