రఘురామ ఫిర్యాదు - ఐపీఎస్ సునీల్ పై చర్యలకు కేంద్రం నిర్దేశం..!!
ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పైన రఘురామ ఫిర్యాదు. చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్ కు కేంద్ర హోం శాఖ లేఖ.
సీనియర్ పోలీసు అధికారి పీవీ సునీల్ కుమార్ పై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ ఏపీ ప్రభుత్వానికి నిర్దేశించింది. ఈ మేరకు ఏపీ ప్రబుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. సునీల్ కుమార్ పైన చర్యలు తీసుకోవాలని ఆ సమాచారం తమకు పంపాలని సూచించింది. సునీల్ కుమార్ ప్రభుత్వాధికారిగా ఉంటూ హిందూ మతానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఎంపీ రఘురామ ఫిర్యాదు చేసారు. సునీల్ కుమార్ వ్యాఖ్యలకు సంబంధించిన డీవీడీలను రఘురామ గతంలోనే కేంద్ర హోం మంత్రి..కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు ఫిర్యాదు చేసారు. దీనిని అప్పట్లోనే కేంద్ర డీఓపీటీ అధికారులు ఆఫీస్ మెమోరాండం రూపంలో హోం శాఖతో పాటుగా ఏపీ ప్రభుత్వానికి పంపింది.
ఇప్పుడు తాజాగా కేంద్ర హోం శాఖ గతంలో రఘురామ చేసిన ఫిర్యాదు..డీఓపీటీ ఆఫీస్ మెమోరాండం పంపుతున్నామని.. వాటిని పరిశీలింది సునీల్ కుమార్ పైన తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. చర్యలు తీసుకోవటంతో పాటుగా సంబంధిత నివేదికను తమకు సమర్పించాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోం శాఖ రాసిన లేఖలో స్పష్టం చేసింది. అంబేద్కర్ ఇండియా మిషన్ వేదికపై పీవీ సునీల్‍కుమార్ విద్వేషపూరిత ప్రసంగం చేసారని గత ఏడాది సెప్టెంబర్ లో ఎంపీ రఘురామ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పైన ఫిర్యాదు చేసారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సునీల్ కుమార్ ప్రసంగించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ప్రసంగాల ఆధారాలను తన ఫిర్యాదుతో జత చేసారు.

దీనిని పరిశీలించిన తరువాత కేంద్ర హోం శాఖ తాజాగా ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. కాగా, ఏపీ ప్రభుత్వం గత నెలలో సీఐడీ చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది. సునీల్ కుమార్ కు ఎటువంటి పోస్టింగ్ లేకుండా రిలీవ్ చేయటం పైన అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చ సాగింది. సునీల్ కుమార్ దాదాపు మూడేళ్ల పాటు సీఐడీ చీఫ్ గా వ్యవహరించారు. రాజకీయ పార్టీలకు ఆయన టార్గెట్ అయ్యారు. ఎంపీ రఘురామ పలు సందర్భాల్లో సునీల్ కుమార్ పైన ఆరోపణలు చేసారు. ఆయన పైన ఫిర్యాదులు పంపారు. ఇప్పుడు కేంద్రం పంపిన లేఖ పైన ఏపీ ప్రభుత్వ స్పందన..తీసుకొనే చర్యలు ఎలా ఉంటాయనేది ప్రభుత్వ వర్గాల్లో చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications