శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, వైసీపీ ఎంపీ సాయిరెడ్డి
తిరుమల: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం విఐపి బ్రేక్ దర్శనం సందర్భంగా ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం కోసం శనివారం మధ్యాహ్నమే ఆమె తిరుమలకు చేరుకున్నారు. సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొన్నారు. అనంతరం పద్మావతి అతిథిగృహంలో బస చేశారు. ఈ ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకాధికారి ఎవి.ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌కు శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని ప్రత్యేకాధికారి అందజేశారు.


ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సివిఎస్‌వో గోపినాథ్ జెట్టి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, పేష్కార్ లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు.

-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications