హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్డీయేలో టీఆర్ఎస్ చేరికపై సుజనా చౌదరి (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు న్యాయబద్ధంగా రావాల్సినవన్నీ వస్తాయని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయమంత్రి సుజనాచౌదరి చెప్పారు. సుజనాచౌదరి ఆదివారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మన దేశంలో బాగా చదువుకున్న యువత ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లి అక్కడే స్దిరపడ్డారని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని అన్నారు.

మన దేశంలోనే అభివృద్ది చేస్తామని, అందుకు తగిన ప్రోత్సాహం ఇస్తామని ఆయన అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో సామాన్యుడికి ఉపయోగపడేలా పరిశోధన ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రైతుకు ఆర్థిక అక్షరాస్యత కూడా కల్పిస్తే అభివృద్ధికి మరింత ఆస్కారం ఉంటుందన్నారు.

రాజకీయ ఉనికి కోసమే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశాన్ని కాంగ్రెస్‌ తెరపైకి తీసుకువస్తుందని సుజనాచౌదరి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అంశాన్ని రాష్ట్రపతి ప్రసంగంలో చేర్చాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది కదా అని మీడియా అడిగినప్పుడు రాష్ట్రపతి ప్రసంగానికి, ప్రత్యేక హోదాకు సంబంధమేంటి? ఏ నిబంధన ప్రకారం దానిలో పెడతారు? న్యాయపరిధిలో ప్రత్యేకహోదాను సాధించేందుకు మేం ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

 ఎన్డీయేలో టీఆర్ఎస్ చేరికపై సుజనా చౌదరి

ఎన్డీయేలో టీఆర్ఎస్ చేరికపై సుజనా చౌదరి

ఎన్డీయేలో తెలంగాణ రాష్ట్ర సమితి చేరుతుందని వార్తలపై సుజనా మాట్లాడుతూ మేం ఎన్డీయేలో భాగస్వాములం. ఎవరైనా చేరేటట్లుంటే భాగస్వామిగా ఉన్న మాతో భాజపా మాట్లాడుతుంది. అలాంటిదేమీ ఇప్పటివరకు లేదు. పుట్టబోయే బిడ్డ ఏ పార్టీలో చేరతాడని అడిగితే ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉందిని చెప్పారు.

 ఎన్డీయేలో టీఆర్ఎస్ చేరికపై సుజనా చౌదరి

ఎన్డీయేలో టీఆర్ఎస్ చేరికపై సుజనా చౌదరి

బిల్లులో పొందుపరిచిన అంశాలన్నీ ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తుందని నమ్మతున్నామని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే రేపు రాబోయే బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్‌ వస్తుందని సుజనా చౌదరి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎన్డీయేలో టీఆర్ఎస్ చేరికపై సుజనా చౌదరి

ఎన్డీయేలో టీఆర్ఎస్ చేరికపై సుజనా చౌదరి

దేశాన్ని నాలుగు జోన్లుగా చేసి ఒక్కో జోన్‌లో ఒక సైన్స్‌ సిటీ నిర్మించాలని ప్రణాళిక తయారుచేస్తున్నామన్నారు. వాటిల్లో కన్వెన్షన్‌ సెంటర్లు, అత్యాధునిక పరిశోధన కేంద్రాలు, శాస్త్రవేత్తలకు అవసరమైన సౌకర్యాలు ఉంటాయన్నారు. ప్రతిజోన్‌లోని సైన్స్‌సిటీ ఆ పరిధిలోని రాష్ట్రాలకు కూడా సేవలందిస్తుందన్నారు.

 ఎన్డీయేలో టీఆర్ఎస్ చేరికపై సుజనా చౌదరి

ఎన్డీయేలో టీఆర్ఎస్ చేరికపై సుజనా చౌదరి

సౌరవిద్యుత్తుపై పరిశోధనా సంస్థలను ఏపీలోని అనంతపురం, రాజస్థాన్‌ రాష్ట్రాలలో నెలకొల్పేందుకు అవకాశాలుంటాయన్నారు. ఫిబ్రవరి 28న సైన్స్‌ డే సందర్భంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

English summary
Union minister Sujana Chowdary speaks to media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X