సీట్ల సర్దుబాటు పై కేంద్ర మంత్రి అసంతృప్తి- అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ..!!

కేంద్ర మంత్రి శ్రీనివాస రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. సీట్ల కేటాయింపు పైన తమ పార్టీకి సరైన ప్రాతినిధ్యం దక్కలేదని సీరియస్ అయ్యారు. ఏకపక్షంగా సీట్ల ఖరారు ఎలా చేస్తారని నిలదీసారు. కొద్ది రోజులుగా తమ పైన ఎంత ఒత్తిడి ఉన్నా... సీట్ల సర్దుబాటు పైన చర్చలు చేస్తున్నామని.. తమ కు సమాచారం లేకుండా సీట్లు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. తమ బలం తక్కువ కాదని.. తాము ఫ్రెండ్లీ కంటెస్ట్ కింద అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. తమకు కేటాయించిన సీట్ల కంటే ఎక్కువ గెలిచి చూపిస్తామని వ్యాఖ్యానించారు.

ఏపీలో రెండో విడత మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. కూటమి పార్టీలు ఎవరెక్కడ పోటీ చేయాలో అంగీకారానికి రావటం తో పలు ప్రాంతాల్లో అభ్యర్ధులను ప్రకటించారు. కార్పోరేషన్, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్ధులను మూడు పార్టీలు వేర్వేరుగా ప్రకటించారు. బాపట్ల మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్ధి ప్రకటన విషయంలో స్థానికులకు అవకాశం ఇవ్వకపోవటం పైన బీజేపీ నేత అన్నం సతీష్ ప్రభాకర్ పార్టీకి రాజీనామా చేసారు. కాగా, ఇప్పుడు భీమవరం మున్సిపల్ ఎన్నికల సీట్ల కేటాయింపు విషయంలో సీట్ల ప్రకటన పైన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 52 వార్డుల్లో కేవలం తమ ఇంటి పక్కన ఉన్న 5 వార్డులను మాత్రమే బీజేపీకి కేటాయించడం అవమానకరమని ఆయన మండిపడ్డారు.

డీలిమిటేషన్ బిల్లుకు ఆ పార్టీల మద్దతు, కాంగ్రెస్ కు షాక్- లెక్క పక్కా.. ముహూర్తం ఫిక్స్..!!
డీలిమిటేషన్ బిల్లుకు ఆ పార్టీల మద్దతు, కాంగ్రెస్ కు షాక్- లెక్క పక్కా.. ముహూర్తం ఫిక్స్..!!
union-minister-verma-unhappy-over-seats-allocation-in-bhimavaram-announces-contest-in-all-wards

భీమవరంలో సీట్ల పంచాయితీ

భీమవరం మున్సిపాల్టీ లో రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ తనయుడికి సైతం ఈ జాబితాలో అవకాశం ఇవ్వకపోవడంపై ఆయన ప్రశ్నించారు. తాము అన్ని వార్డుల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. తమకు సమాచారం ఇవ్వకుండా మిగతా 2 పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయని.. బీజేపీకి నాలుగు వార్డులే కేటాయిస్తారా అంటూ సీరియస్ అయ్యారు. తమ ఇంటి చుట్టూ ఉన్న వార్డులు మాత్రమే బీజేపీకి ఇస్తే సరిపోదని పేర్కొన్నారు. పార్టీలో ఇద్దరు పట్టణాధ్యక్షుల్లో ఒక్కరికీ సీటు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. తాము పొత్త లేకపోయినా సీట్లు గెలుస్తామని వ్యాఖ్యానించారు. 1981 నుంచి భీమవరం మున్సిపాలిటీలో బీజేపీకి ప్రాతినిధ్యం ఉందని గుర్తుచేసిన శ్రీనివాస వర్మ, పార్టీ ఆత్మగౌరవం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అవసరమైతే భీమవరంలోని అన్ని స్థానాల్లో బీజేపీ సొంతంగా (ఫ్రెండ్లీ పోటీ) బరిలోకి దిగుతుందని ఆయన హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+