చంద్రబాబుతో అమిత్ షా, జేపీ నడ్డా భేటీ
అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయడు ముఖ్యమంత్రిగా ప్రమాణ సీకారం నేపథ్యంలో కేంద్ర మంత్రులు, వీవీఐపీలు విజయవాడకు తరలి వస్తున్నారు. గన్నవరం ఏయిర్ పోర్టుకు చేరుకు చేరుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మెగా స్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ తదితరులకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, టీడీపీ నేతలు స్వాగతం పలికారు.
తాజాగా మంగళవారం రాత్రి రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోం మత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నారా లోకేశ్ గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నేతలు ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులు అమిత్ షా, నడ్డాకు స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రివర్గ కూర్పుపై, కూటమి నేతలు చంద్రబాబుతో చర్చించారు.

చర్చల అనంతరం అమిత్ షా, నడ్డాలు నోవాటెల్ హోటల్‌లో బస చేయనున్నారు. బీజేపీ మంత్రుల విషయంలో స్పష్టత వచ్చాక, మిగతా మంత్రివర్గంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అనంతరం చంద్రబాబు గవర్నర్‌కు మంత్రుల జాబితాను పంపనున్నారు. మంత్రులుగా అవకాశం దక్కిన బీజేపీ నేతలకు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేస్తారని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర ముఖ్య అతిథిగా ఆహ్వానాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి విజయవాడ చేరుకున్నారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన కుటుంబసభ్యులతో కలిసి బయల్దేరారు. చిరంజీవి వెంట ఆయన సతీమణి సురేఖ, కుమార్తె శ్రీజతోపాటు ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు. బుధవారం ఉదయం జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో కుటుంబంతో కలిసి చిరంజీవి పాల్గొననున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications