కిల్లి కృపారాణి కారును మూడుసార్లు ఢీకొట్టే యత్నం

అయితే ఆ తర్వాత వారి వాహనం మరో ఎస్కార్టు వాహనాన్ని రాసుకుంటూ వెళ్లిపోయింది. దీంతో ఎస్కార్టుగా ఉన్న వారు పోలీసులను అప్రమత్తం చేశారు. హనుమంతవాక వద్ద పోలీసులు ఢీకొట్టే ప్రయత్నాలు చేసిన వాహనాన్ని పట్టుకొని, నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారు తాగిన మత్తులో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.
సోనియా దిష్టి బొమ్మ దగ్ధం
రాష్ట్ర విభజనకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలపడంపై సీమాంధ్ర జిల్లాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ బాధ్యులు బివి జయనాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి, దగ్ధం చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మను ఊరేగించి దగ్ధం చేశారు.












Click it and Unblock the Notifications