ఫేస్ బుక్ కలిపింది ఇద్దరిని, ప్రేమ, పెళ్ళి ఇలా...దివ్యాంగురాలని తెలిసి.....
ఫేస్ బుక్ ఇద్దరిని కలిపింది. వారిద్దరూ వివాహం చేసుకొనేందుకు కారణంగా మారింది. తాను ప్రేమించిన అమ్మాయి దివ్యాంగురాలని తెలిసి కూడ ఆ అబ్బాయి వివాహం చేసుకొనేందుకు ముందుకు వచ్చాడు.
విశాఖపట్టణం:ఫేస్ బుక్ ఇద్దరిని ఒక్కటీ చేసింది, అంతే కాదు వారిద్దరూ వివాహం చేసుకొన్నారు. తాను ప్రేమించే అమ్మాయి వికలాంగురాలని తెలిసి కూడ ఆ అబ్బాయి అమ్మాయిని వివాహం చేసుకొనేందుకు ముందుకు వచ్చాడు.అంతేకాదు ఆ అమ్మాయికి తల్లిదండ్రులు కూడ ఎవరూ లేరు. ఫేస్ బుక్ కలిపింది వారిద్దరిని ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకొంది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారి మద్య సంబంధాలను కలిపేందుకుగాను ఫేస్ బుక్ దోహదపడుతోంది.అయితే ఒకరంటే మరోకరికి తెలియదు. అయితే ఫేస్ బుక్ పరిచయం ఇద్దరిని కలిపింది.అంతేకాదు ఇద్దరి పెళ్ళికి కూడ ఫేస్ బుక్ కారణంగా మారింది.
తాపీ మేస్రీగా పనిచేసే నవీన్, దివ్యాంగురాలైన సావిత్రి మద్య ప్రేమకు ,ఆ తర్వాత పెళ్ళికి కూడ ఫేస్ బుక్ కారణంగా మారింది. వీరిద్దరూ శనివారం నాడు సింహాద్రి అప్పన్నస్వామి సన్నిధిలో వివాహం చేసుకొన్నారు.

పురపు సావిత్రికి మూడేళ్ళ వయస్సులోనే పోలియో రావడంతో ఆమె తల్లిదండ్రులు విశాఖ పట్టణంలోని రాణీ చంద్రమణి దేవి ఆసుపత్రిలో చేర్పించి వదిలేశారు. ఆసుపత్రి యాజమాన్యామే ఆ బాలికకు పదేళ్ళ వయస్సు వచ్చేవరకు పెంచారు. ఆమెకు చదవును కూడ చెప్పించారు.
అనంతరం శ్రీకాకుళంలోని ఒ క అనాథ శరణాలయంలో చేర్పించారు. అక్కడే ఆమె పదవతరగతి వరకు చదువుకొంది. అయితే ఏయూ లో ఫ్రోఫెసర్ గా పనిచేస్తున్న కేపీ సుబ్బారావు ఆయన భార్య , స్త్రీ శక్తి మహిళా సంఘం సభ్యురాలు భవ్య లలిత దంపతులు సావిత్రిని దత్తత తీసుకొన్నారు.
సావిత్రిని ఉన్నత చదవులు చదివించారు. ప్రస్తుతం సావిత్రి ఏయూలో పిజీ చేస్తోంది. అంతేకాదు ఆమె గ్రూప్ పరీక్షలకు సిద్దమౌతోంది.ఈ క్రమంలోనే 2016 లో సావిత్రికి 24 ఏళ్ళ నవీన్ అనుకోకుండా ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది.
ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది.అంతేకాదు వీరిద్దరూ కూడ వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే సావిత్రి దివ్యాంగురాలని తెలిసినా కాని నవీన్ వెనుకాడలేదు.
శనివారం నాడు సింహాద్రి అప్పన్నస్వామి సన్నిధిలో వీరిద్దరూ కూడ వివాహం చేసుకొన్నారు. సావిత్రిని దత్తత తీసుకొన్న కేపీ సుబ్బారావు దంపతులు, మహిళా సంఘం ప్రతినిధులు తదితరులు ఈ వివాహనికి హజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.












Click it and Unblock the Notifications