జగన్ కంచుకోటలో.. వైసీపీ నేతపై హత్యాయత్నం: వేటకొడవళ్లతో విరుచుకుపడి..

శుక్రవారం రాత్రి 10గం. ప్రాంతంలో.. రాఘవేంద్ర హాలు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో చిన్నపురెడ్డి తన ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్నట్లుగా చెబుతున్నారు.

పులివెందుల: కడప జిల్లాకు పులివెందులకు చెందిన వైసీపీ నేత చిన్నపురెడ్డి(45)పై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి ప్రయత్నించారు. వేటకొడవళ్లతో విచక్షణా రహితంగా దాడి చేయడంతో.. తీవ్ర ప్రాణాపాయ స్థితిలో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

శుక్రవారం రాత్రి 10గం. ప్రాంతంలో.. రాఘవేంద్ర హాలు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో చిన్నపురెడ్డి తన ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్నట్లుగా చెబుతున్నారు.

ఆయన కదలికలపై ముందే నిఘా పెట్టిన ప్రత్యర్థులు.. రాఘవేంద్ర హాలు సమీపంలోని కూరగయాల మార్కెట్లో మాటు వేశారు. చిన్నపురెడ్డి అటువైపుగా రాగానే ఒక్కసారిగా వేటకొడవళ్లతో విరుచుకుపడ్డారు.

Attack ysrcp

దాడిలో చిన్నపురెడ్డి చేతివేళ్లు రెండు తెగిపోగా.. తలకు తీవ్ర గాయాలయ్యాయి. హత్యాయత్నాన్ని దగ్గరి నుంచి చూసిన కొంతమంది స్థానికులు గట్టిగా కేకలు వేయడంతో దుండగులు అక్కడినుంచి పారిపోయారు. చిన్నపురెడ్డిపై హత్యాయత్నం జరగిందని తెలియగానే.. కడప ఎంపీ వైఎస్ అవినాష రెడ్డి,పార్టీ కార్యదర్శి దేవిరెడ్డి శివశంకరె రెడ్డి ఆయన్ను పరామర్శించడానికి వెళ్లారు.

ఆపై డాక్టర్లతో మాట్లాడి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. బాధితున్ని చూసేందుకు భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆసుపత్రికి తరలివచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+