కృష్ణయ్యపై, కెకెలపై రాళ్ల దాడి, టిడిపి తమ్ముళ్ల వీరంగం

నల్గొండలో కార్యాలయంపై దాడి
నల్గొండ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తెలుగు తమ్ముళ్లు ధ్వసం చేశారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన తమను సంప్రదించకుండా భారతీయ జనతా పార్టీకి కేటాయించడాన్ని తట్టుకోలేని కంచర్ల భూపాల్ రెడ్డి వర్గీయులు జిల్లా పార్టీ కార్యాలయంపై దాడి చేశారు.
పార్టీ కార్యాలయం పైన ఉన్న జెండా పీకేసి, కుర్చీలను విరగ్గొట్టి, అద్దాలను ధ్వసం చేశారు. అధికారంలో లేకపోయినా పార్టీని, క్యాడర్‌ని కాపాడుకుంటూ వస్తున్న తమను విస్మరించడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. బిజెపి వాళ్లకి వారి కుటుంబ సభ్యుల ఓట్లు తప్ప అదనంగా ఒక్క ఓటు కూడా రాదని అలాంటి వారికి ఎలా కేటాయిస్తారన్నారు.
మెదక్‌లో కెకె వాహనంపై రాళ్ల దాడి
మెదక్ జిల్లాలో తెరాస సీనియర్ నేత కె కేశవ రావు వాహనంపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసి ఉంటారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications