వివేకా హత్యకేసు దర్యాప్తుపై ఎన్నో అనుమానాలు- ది వైర్
అమరావతి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు.. అనూహ్య మలుపులు తిరుగుతోంది. దీనిపై జాతీయ మీడియా సైతం దృష్టి సారించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఈ హత్యోదంతం చర్చనీయాంశం కాలేదు. సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలను స్వీకరించిన అనంతరం ఈ కేసు దర్యాప్తు తీరుపై అందరి దృష్టీ నిలిచింది.
వివేకా హత్యకేసుపై ఆంగ్ల వెబ్‌సైట్ ది వైర్ పలు కోణాల్లో అనుమానాలను వ్యక్తం చేయడంతో దీనిపై ఫోకస్ పడింది. సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చల్లోకి ఎక్కింది. హత్య జరిగిన నాలుగు సంవత్సరాల తరువాత కూడా సీబీఐ ఈ కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతిని సాధించ లేదని ది వైర్ తేల్చేసింది.

దర్యాప్తు మొత్తం ఒకే కోణంలో సాగిందని, వివేకానందరెడ్డి హత్యకు ఇతరత్రా కారణాలు ఏవైనా ఉండొచ్చనే దిశగా సీబీఐ ఆలోచన చేయలేదని పేర్కొంది. ఈ క్రమంలో కొన్ని ప్రశ్నలను సైతం లేవెనెత్తింది ది వైర్ వెబ్‌సైట్. వాటికి సమాధానాలు లభించట్లేదని అభిప్రాయపడింది. ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఆయనను మాత్రమే దోషిగా రుజువు చేయడానికి నాలుగు సంవత్సరాల పాటు సీబీఐ ప్రయత్నించినట్లుగా భావించాల్సి వచ్చిందని అంచనా వేసింది.
వివేకా హత్యకు గురయ్యే సమయానికే కడప లోక్‌సభ అభ్యర్థి ఖరారైనప్పటికీ.. ఆ సీట్ కోసమే నిందితులు ఆయనను దారుణంగా హత్య చేసినట్లుగా సీబీఐ వాదించినట్లు కనిపిస్తోందంటూ ది వైర్.. తన కథనంలో వివరించింది. అప్పటికే కడప లోక్‌సభ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి పేరును వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసింది.
అవినాష్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారయ్యాక ఆయనకు మద్దతుగా వివేకానందరెడ్డి ఎన్నికల్లో సైతం విస్తృతంగా ప్రచారం చేసిన విషయాన్ని ప్రస్తావించింది. ఆ విషయాన్ని కూడా సీబీఐ తన దర్యాప్తు సందర్భంగా ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని, ఎంపీ టికెట్ కోసమే వివేకా, అవినాష్ రెడ్డి మధ్య మనస్పర్థలు, విభేదాలు తలెత్తి, హత్యకు దారి తీసిందనే కోణంలోనే దర్యాప్తు జరిగిందని పేర్కొంది.
దానికి సంబంధించి ఏ ఒక్క ఆధారాన్ని కూడా సీబీఐ సంపాదించలేకపోయిందని ది వైర్ స్పష్టం చేసింది. అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ ఆయనకు ఈ హత్యతో ప్రమేయం ఉందని చెప్పే ఒక్క ఆధారాన్ని కూడా కోర్టుకు సమర్పించలేకపోయిందని, అసలు అవినాష్ రెడ్డి బలమైన అభ్యర్థి కాదని వివేకా భావించారంటూ వైఎస్ షర్మిల గతంలో ఇచ్చిన వాంగ్మూలాన్ని ప్రామాణికంగా తీసుకుని దర్యాప్తు సాగించిందని అభిప్రాయపడింది.
ఈ విషయంలో షర్మి ఇచ్చిన వాంగ్మూలానికి ఆధారాన్ని కూడా సీబీఐ సేకరించలేకపోయినట్లు ది వైర్ తన కథనంలో ప్రచురించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి అవినాష్ రెడ్డి కారణం అని సీబీఐ అభిప్రాయపడిందే తప్ప దానికీ ఆధారాల్లేవని వివరించింది. షమీమ్ అనే మహిళను వివేకా రెండో పెళ్లి చేసుకోవడం, ఇటు ఆయన కూతురు సునీతకు, భార్య సౌభాగ్యమ్మకు ఇష్టంలేదని, అందుకే ఆయనకు ఉన్న చెక్ పవర్ సైతం లాగేసుకున్నారనే కోణంలో దర్యాప్తు ఎందుకు జరగలేదో అర్థం కావట్లేదని ది వైర్ పేర్కొంది.
ఈ విషయంలో సౌభాగ్యమ్మ సోదరులు తనను బెదిరించినట్లు షమీమ్ నేరుగా సీబీఐ వద్ద వాంగ్మూలం ఇచ్చినప్పటికీ- ఈ కోణంలో సీబీఐ ఎందుకు విచారించలేదనే అనుమానాన్ని ది వైర్ వ్యక్తం చేసింది. ఆ హత్య వెనుక ఆర్థిక లావాదేవీలు ఉండొచ్చనే కోణాన్ని ఎందుకు సీబీఐ పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications