UNSTOPPABLE బాలయ్య- రవితేజ మధ్య అసలు గొడవ ఏంటి : కాలేజీలో సైట్ కొట్టటం-డ్రగ్స్ కేసు పై క్లారిటీ..!!
నందమూరి బాలయ్య ఏ మాత్రం తగ్గటం లేదు. తాను హోస్ట్ గా నడిపిస్తున్న అన్ స్టాపబుల్ ప్రోగ్రాంలో పేరుకు తగినట్లుగానే దూసుకుపోతున్నారు. సెలబ్రేటీలతో టాక్ షో లో ఎపిసోడ్ టు ఎపిసోడ్ మరింత వేడి పెంచుతున్నారు. ఒక వైపు ఓటీటీలో ఈ కార్యక్రమంలో సందడి చేస్తున్న బాలయ్యకు..అఖండ మూవీ మరింత బలం పెంచింది. కరోనా ముందు...కరోనా తరువాత అన్నట్లుగా మారిన టాలీవుడ్ లో అఖండ ఇచ్చిన బూస్టర్ మామూలుగా లేదు. ఇప్పడు భారీ బడ్జెట్ తో సినిమాలు తీసి విడుదలకు సిద్దంగా ఉన్న నిర్మాతలకు సైతం మానసికంగా ధైర్యాన్ని ఇచ్చింది.

బాలయ్య - మాస్ మహారాజ ఆట
ఇక, అప్ స్టాపబుల్ అంటూ టాలీవుడ్ ప్రముఖులతో రచ్చ చేస్తున్న బాలయ్య ఇప్పటికే అయిదు ఎపిసోడ్లు పూర్తి చేసారు. ఇక, ఆరో ఎపిసోడ్ సైతం సిద్దం అయింది. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - బాలయ్య సందడి చేయనున్నారు. క్రిస్మస్ నాడు ఈ ఎపిసోడ్ విడుదల కానుంది. ఇప్పుడు, తాజాగా ఎపిసోడ్ 7 ప్రోమో బయటకు వచ్చింది. అందులో బాలయ్య లో కొత్త జోష్ కనిపిస్తోంది. మాస్ మహారాజ రవితేజ తో పాటుగా దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి బాలయ్య ఇంటస్ట్రింగ్ ప్రశ్నలు..అదే సమయంలో పంచ్ లు వేస్తూ కొత్త ఎనర్జీతో కనిపించారు.

ఇద్దరూ కలిసి అల్లరి
బాలయ్య ప్రశ్నలకు రవితేజ సైతం ఇచ్చిన సమాధానాలతో ఈ ఎపిసోడ్ ఆసక్తి పెంచేలా ఉంది. దీనికి సంబంధించిన ప్రోమో లో బాలయ్య గతంలో జరిగిన ప్రచారాన్ని ప్రస్తావించారు. ఏంటి..మన ఇద్దరి మధ్య ఏదో గొడవ ఉందంట కదా..ఏంటది అంటూ బాలయ్య ఒక డిఫరెంట్ గా ప్రశ్నించటం..దీనికి తగినట్లుగా రవితేజ సమాధానం చెబుతారు. పనీపాటలేని డాష్ గాళ్లకు ఇదే పని అంటూ నవ్వుతూ చెబుతారు. దీని ద్వారా అసలు వారిద్దరి మధ్య గొడవలు లేవనే విషయాన్ని బాలయ్య - రవిజేత చెప్పకనే చెప్పేసారు. దీనికి కొనసాగింపుగా ఈ ప్రోమోలో బాలయ్య వేసిన ప్రశ్నలు.. రవితేజ చెప్పే మాస్ సమాధానలు మొత్తం ప్రోగ్రాంనే ఆసక్తి కరంగా మలిచాయి.

కాలేజీ లైఫ్ నుంచి డ్రగ్స్ దాకా
ఇక, రవితేజ కాలేజీ లైఫ్ గురించి బాలయ్య చిలిపి ప్రశ్నలు వేయటం.. కాలేజీలో అమ్మాయి లకు సైట్ కొట్టేవాడివి అంట కదా అంటూ బాలయ్య అడగగానే... ఎవరు చెప్పారంటూ రవితేజ సిగ్గుపడుతూ కనిపించటంతో మొత్తం నవ్వులు విరిసాయి. ఇక, బాలయ్య తన కాలేజీ లైఫ్ గురించి చెప్పొకొచ్చారు. మధ్య మధ్యలో దర్శకుడు గోపీచంద్ మలినేనిని అటు నుంచి బాలయ్య...ఇటు నుంచి రవితేజ్ ఒక ఆట ఆడుకోవటం ప్రోమోలో మరో ఇంట్రస్టింగ్ అంశం.

దర్శకుడిని ఆడేసుకున్నారుగా
సమరసింహా రెడ్డి కోసం జైల్లో ఉన్నా అన్న విషయం చెప్పిన గోపీచంద్.. రెండు పడ్డాయా అని బాలయ్య అంటే.. ఒకటి శాంపిల్ వేశారంటూ గోపీచంద్ సమాధానం ఇవ్వటంతో అందరూ నవ్వేస్తారు. ఇక, సరదాగా సాగిపోతున్న సమయంలో బాలయ్య సడన్ గా రవితేజ తో డ్రగ్స్ గురించి ప్రశ్నిస్తారు. దీని పైన రవితేజ ఆవేదన..బాధ తో సమాధానం ఇవ్వటంతో ఏం చెబుతున్నారా అనే ఆసక్తి పెరుగుతుంది. ఇక, సరదా..ఎమోషనల్..ప్రచారాలు..వాస్తవాలు..లైఫ్ లో కీలక ఘట్టాలు..ఇలా అన్నీ కలగలపి..ప్రేక్షకులకు అన్ స్టాపబుల్ లో బాలయ్య - రవితేజ అల్లరి ఇంట్రస్టింగ్ గా మార్చేసారు. ఇప్పుడు ఈ ప్రోమో వైరల్ అవుతోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications