మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్‌కు ముహూర్తం ఫిక్స్..!!

నందమూరి బాలకృష్ణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కనిపించిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 లేటెస్ట్ ఎపిసోడ్ పార్ట్ 1 ప్రసారం కావడానికి ముహూర్తం కుదిరింది. కొద్దిసేపటి కిందటే ఈ విషయాన్ని ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ వెల్లడించింది.

అమరావతి: ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 లేటెస్ట్ ఎపిసోడ్ త్వరలో టెలికాస్ట్ కానుంది. పవర్ ప్యాక్డ్ ఎపిసోడ్ ఇది. పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇందులో సందడి చేయడమే దీనికి కారణం. ఈ ఎపిసోడ్ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు చెందిన ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రసారం కానుంది. ఇదివరకే దీనికి సంబంధించిన ప్రొమో విడుదలైంది.

ఎలా ఉండబోతోందో..

ఎలా ఉండబోతోందో..

బాలకృష్ణ- పవన్ కల్యాణ్ మధ్య చిత్రీకరించిన ఈ ఎపిసోడ్ ఎలా ఉండబోతోందనేది ఈ ప్రోమో స్పష్టం చేసింది. ఇద్దరూ రాజకీయాల్లో కొనసాగుతోండటం, పైగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రత్యర్థులుగా ఉండటం ఆసక్తి రేపుతోంది. జనసేన పార్టీ అధినేతగా పవన్ కల్యాణ్.. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశానికి చెందిన హిందూపురం శాసన సభ్యుడిగా బాలకృష్ణ.. వైఎస్ఆర్సీపీని గట్టిగా వ్యతిరేకిస్తూ వస్తోన్నారు.

ఒకే వేదికపై..

ఒకే వేదికపై..

అలాంటి వారిద్దరూ ఒకే వేదికపై కనిపించడం మొదటి నుంచీ ఆసక్తి రేపుతోంది. ఎలాంటి అంశాలు వారిద్దరి మధ్య ప్రస్తావనకు వస్తాయనే విషయం ఉత్కంఠతకు గురి చేస్తూనే ఉంది. వాటన్నింటికీ తెర పడబోతోంది.. ఇంకొద్దిరోజుల్లో. ఈ లెటెస్ట్ ఎపిసోడ్ లో కూడా రాజకీయాల ప్రస్తావన రావడం ప్రాధాన్యతను సంతరించరుకుంది. పవన్ కల్యాణ్.. రాజకీయాలపై మాట్లాడారు. తాను ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నానని అంటూ పెద్దగా నవ్వడం కనిపించింది. ఆ రాజకీయాలే వద్దు అంటూ బాలకృష్ణ ఆయనను వారించారు.

పద్ధతిగా మాట్లాడతా..

పద్ధతిగా మాట్లాడతా..

ఈ మధ్య నీ విమర్శల్లో వాడి వేడి బాగా పెరిగిందని, డబుల్ ఇంపాక్ట్ అయిందంటూ బాలకృష్ణ ప్రశ్నించగా.. దానికి పవన్ కల్యాణ్ లేదు. నేను చాలా పద్ధతిగా మాట్లాడతానండీ అని బదులిచ్చారు. అన్నయ్య చిరంజీవి నుంచి నేర్చుకున్నవి ఏమిటీ?, వద్దనుకున్నవి ఏమిటీ? అనే ఆసక్తికరమైన ప్రశ్నను సంధించారు పవన్ కల్యాణ్. దీనికి పవన్ కల్యాణ్ సూటిగా సమాధానం వచ్చిందా? లేదా? అనేది ఫుల్ ఎపిసోడ్ చూస్తే గానీ తెలియదు.

ఓట్లు పడకపోవడం పట్ల..

ఓట్లు పడకపోవడం పట్ల..

ఒకసారి తన వదిన ఫోన్ చేస్తే- తనకు ఇదే చివరి సినిమా అవుతుందని, ఇక తన వల్ల కాదని సమాధానం ఇచ్చినట్లు పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పవన్ కల్యాణ్ కు ఫ్యాన్ కాని వాడు లేడు.. అలాంటప్పుడు ఆ ప్రేమ ఓట్లుగా ఎందుకు కన్వర్ట్ అవ్వలేదని మీ ఉద్దేశం అని బాలకృష్ణ సూటిగా ప్రశ్నించారు.

ఫిబ్రవరి 3న

బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు.. పవన్ కల్యాణ్ ఎలాంటి జవాబులు ఇచ్చారనే విషయం.. ఫిబ్రవరి 3వ తేదీన తేలిపోనుంది. వారిద్దరు కనిపించిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 ఎపిసోడ్ అదే రోజున ప్రసారం కానుంది. రాత్రి 8 గంటలకు ఆహా ఓటీటీలో టెలికాస్ట్ అవుతుంది. మెగా కాంపౌండ్ కే చెందిన హీరో సాయి ధరమ్ కూడా ఈ ఎపిసోడ్ లో మరో గెస్ట్ గా అటెండ్ అయ్యారు. ఈ ముగ్గురూ కలిసి అన్‌స్టాపబుల్ లో ఎలాంటి సందడి చేస్తారు? రాజకీయంగా ఎలాంటి వివాదాలకు తెర తీస్తారనేది ఆ రోజున తేలిపోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+