ఓడిపోవడానికి నేను సిద్ధమే కానీ- తేల్చేసిన పవన్: ఏ ప్రశ్న అడక్కూడదో అదే అడిగేసిన బాలయ్య..!!

అమరావతి: ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 లేటెస్ట్ ఎపిసోడ్ షూటింగ్ మొదలైంది. పవర్ ప్యాక్డ్ ఎపిసోడ్ ఇది. పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇందులో సందడి చేయడమే దీనికి కారణం. ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా ఆరంభమైంది. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు చెందిన ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రసారమౌతుంది.

 చంద్రబాబుతో..

చంద్రబాబుతో..

ఈ టాక్ షో సెకెండ్ సీజన్- తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడితో ఆరంభమైంది. ఇప్పుడు తాజాగా పవన్ కల్యాణ్ దీనికి హాజరయ్యారు. ఇంతకుముందు ఎపిసోడ్‌లో ప్రభాస్, గోపీచంద్ తళుక్కున మెరిశారు. వారితో బాలయ్యబాబు సందడి చేశారు. ఆ ఎపిసోడ్ ప్రోమోస్ విడుదలయ్యాయి. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ ఈ టాక్ షోకు హాజరు కానున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్ ఆరంభమైంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్నాయి.

త్రివిక్రమ్ ఫ్రెండ్..

బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 2 కోసం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఓ ఎపిసోడ్‌లో ఆయన త్రివిక్రమ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అన్‌స్టాపబుల్‌కు ఎప్పుడు వస్తున్నావంటూ ప్రశ్నించారు. మీరు ఓకే అంటే వెంటనే వచ్చేస్తా నంటూ త్రివిక్రమ్ బదులిచ్చారు. ఎవరితో రావాలో తెలుసు కదా? అంటూ పవన్ కళ్యాణ్ గురించి బాలకృష్ణ ప్రస్తావించారు. ఆ ఎపిసోడ్‌తో పవన్ కల్యాణ్ ఈ షోలో పాల్గొనబోతోన్నారనే హింట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌కు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లోజ్ ఫ్రెండ్ కావడమే దీనికి కారణం.

ప్రోమో అవుట్..

ప్రోమో అవుట్..

ఈ ఎపిసోడ్ కు చెందిన ప్రొమో కొద్దిసేపటి కిందటే విడుదలైంది. ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ యాజమాన్యం- ఈ ప్రొమోను తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్లల్లో పోస్ట్ చేసింది. ఈ ప్రోమోలో పవన్ కల్యాణ్ రాజకీయాల గురించి ప్రస్తావించారు. తాను ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నానని అంటూ పెద్దగా నవ్వడం కనిపించింది. ఆ రాజకీయాలే వద్దు అంటూ బాలకృష్ణ ఆయనను వారించారు.

 పద్ధతిగా

పద్ధతిగా

ఈ మధ్య నీ విమర్శల్లో వాడి వేడి బాగా పెరిగిందని, డబుల్ ఇంపాక్ట్ అయిందంటూ బాలకృష్ణ ప్రశ్నించగా.. దానికి పవన్ కల్యాణ్ లేదు. నేను చాలా పద్ధతిగా మాట్లాడతానండీ అని బదులిచ్చారు. అన్నయ్య చిరంజీవి నుంచి నేర్చుకున్నవి ఏమిటీ?, వద్దనుకున్నవి ఏమిటీ? అనే ఆసక్తికరమైన ప్రశ్నను సంధించారు పవన్ కల్యాణ్. దీనికి పవన్ కల్యాణ్ సూటిగా సమాధానం వచ్చిందా? లేదా? అనేది ఫుల్ ఎపిసోడ్ చూస్తే గానీ తెలియదు.

ఓట్లుగా..

ఓట్లుగా..

ఒకసారి తన వదిన ఫోన్ చేస్తే- తనకు ఇదే చివరి సినిమా అవుతుందని, ఇక తన వల్ల కాదని సమాధానం ఇచ్చినట్లు పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పవన్ కల్యాణ్ కు ఫ్యాన్ కాని వాడు లేడు.. అలాంటప్పుడు ఆ ప్రేమ ఓట్లుగా ఎందుకు కన్వర్ట్ అవ్వలేదని మీ ఉద్దేశం అని బాలకృష్ణ సూటిగా ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+