unstoppable2: బాలకృష్ణ అడిగినదానికి ప్రభాస్ నో చెప్పారా?

కథానాయకుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్‌ షో అన్‌స్టాపబుల్‌2. ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా సీజన్‌2 ప్రసారమవుతోంది. ఇప్పటికే యంగ్‌ హీరోలు, టాలీవుడ్‌ ప్రముఖులు, పలువురు పొలిటీషియన్స్‌ ఈ షోకి అతిథులుగా వచ్చారు. కొన్నిరోజుల నుంచి ఈ బ్లాక్‌బస్టర్‌ షోకి స్టార్‌ హీరో ప్రభాస్‌ వస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిని ధ్రువీకరిస్తూ ఆహా ఓ ప్రత్యేకమైన వీడియో విడుదల చేసింది.

ప్రభాస్‌, బాలకృష్ణ ఒకే స్టైల్‌లో చేసిన సన్నివేశాలను ఎడిట్‌ చేసిన వీడియోను ఆహా పోస్ట్ చేసింది. బాహుబలి ఎపిసోడ్‌ త్వరలో మీ ముందుకు రానుందని, అందరూసిద్ధంగా ఉండండి అంటూ ట్వీట్ చేసింది. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఈ వీడియోచూసి ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. చాలా రోజుల తర్వాత వారి అభిమాన కథానాయకుడు తెరపై కనిపించబోతున్నాడన్న ఆనందంలో ఉన్నారు. దీంతో ఈ వీడియోను తెగ షేర్‌ చేస్తున్నారు. బాలకృష్ణ మాస్‌ ప్రశ్నలకు ప్రభాస్‌ చెప్పే క్రేజీ సమాధానాలు ఎలా ఉంటాయోనని, పలు ప్రశ్నలకు ప్రభాస్ యస్ చెప్పాడా? నో చెప్పాడా? అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.

unstoppable2 special show balakrishna and prabhas video release aha

ఇద్దరు, ముగ్గురు కథానాయకులతో మల్టీస్టారర్స్ గతంలో వచ్చేవి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తరం వచ్చిన తర్వాత అన్నీ సోలో చిత్రాలేకానీ మల్టీస్టారర్స్ రాలేదు. ఆ లోటును వారి అభిమానులు అన్ స్టాపబుల్ ద్వారా తీర్చుకుంటున్నారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోకి మోహన్ బాబు నుంచి చంద్రబాబునాయుడి వరకు వస్తున్నారు. అంతేకాకుండా యంగ్ హీరోలు శర్వానంద్, సిద్ధూ జొన్నలగడ్డ, అడవి శేష్ తదితరులు వచ్చారు. తాజాగా ప్రభాస్ రాబోతున్నారు. ఒకరకంగా ఇది మల్టీస్టారర్ షోలా రూపుదిద్దుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+