3న తిరుమలలో ముక్కోటి ఉత్సవం- అదే రోజు ఆలయం మూత

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం నాడు 62,074 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 27,784 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.21 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 నుండి 18 గంటల సమయం పట్టింది.

కాగా- మార్చి నెలలో తిరుమలలో నిర్వహించే పండుగలు, ఉత్సవాలు, ఇతర విశేష పర్వదినాల వివరాలను టీటీడీ విడుదల చేసింది. మార్చి 2వ తేదీన శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల సమాప్తితో మార్చి నెల ఉత్సవాలు ఆరంభమౌతాయి. ప్రస్తుతం తిరుమలలో తెప్పోత్సవాలు వైభవంగా కొనసాగుతునన విషయం తెలిసిందే. తిరుమల శ్రీవారి పుష్కరిణిలో స్వామివార్లు ఊరేగుతున్నారు. మార్చి 2వ తేదీన ఇవి ముగుస్తాయి.

Unveil the Sacred March Month in Tirumala Festivals and Religious Observances Must-See for Devotees

3న కుమారధార తీర్థ ముక్కోటి నిర్వహించనున్నారు. ఆ రోజున తెల్లవారుజామున 5 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం వ‌ర‌కు మాత్ర‌మే కుమార‌ధార తీర్థాన్ని దర్శించుకోవచ్చు. అధికబరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, చిన్న‌పిల్ల‌లు, వృద్ధుల శ్రేయ‌స్సును దృష్టిలో ఉంచుకుని అట‌వీ మార్గంలో ఈ తీర్థానికి న‌డిచి వెళ్ల‌డానికి అనుమ‌తి ఉండదు. గోగ‌ర్భం నుండి పాప‌వినాశ‌నం వ‌ర‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో మాత్ర‌మే భ‌క్తుల‌ను అనుమ‌తి ఇస్తారు. ట్రాఫిక్ ర‌ద్దీ దృష్ట్యా ప్రైవేటు వాహ‌నాల‌ను కూడా వెళ్లనివ్వరు.

అదే రోజున చంద్ర గ్రహణం కారణంగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. సంప్రోక్షణ అనంతరం తెరుస్తారు. భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తారు. 15న వైష్ణవ ఏకాదశి కార్యక్రమం ఉంటుంది. ఇక 19న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం, నూతన తెలుగు సంవత్సరాది ఉత్సవాలను నిర్వహిస్తారు. 27న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం, 28న శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం, 30న తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభమౌతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+