అనుచిత వ్యాఖ్యలు: జగన్ పార్టీ కార్యకర్త అరెస్టు

unwanted comments: YSRCP activist arrested
హైదరాబాద్‌: హుధుద్ తుఫాను బాధితులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తను అరెస్టు చేశారు. ఫేస్‌బుక్‌లో అతను తుఫాను బాధితులపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

గుంటూరు జిల్లా ఆరండల్‌పేటకు చెందిన చాగంటి రాహుల్ రెడ్డిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తుఫాను వచ్చి వెళ్లిన తర్వాత "ఐ లవ్ హుద్‌హుద్.... మోసం చేస్తున్నవారిని మాత్రం బెండు తీస్తున్న ప్రకృతి.. ఫీలింగ్ గాడ్ ఈజ్ దేర్" అనే వ్యాఖ్యలను అతను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు.

ఆ వ్యాఖ్యలకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను దర్యాప్తు అధికారులు సేకరించి అతన్ని అరెస్టు చేశారు. రాహుల్ రెడ్డి ప్రస్తుతం బిఎల్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. గుంటూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విద్యార్థి విభాగంతో అతనికి సన్నిహిత సంబంధాలున్నాయి.

అలాంటి వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలపైనే సికింద్రాబాద్ సైనిక్‌పురికి చెందిన సముద్రాల ఉదయ్ కుమార్ అనే వ్యక్తిని ఈ నెల 18వ తేదీన సిఐడి పోలీసులు అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండుకు తరలించారు. హుధుద్ తుఫాను నేపథ్యంలో కొన్ని సామాజిక మాధ్యమాలు, వెబ్‌సైట్లలో బాధితులపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+