ఫోన్ పేలో యూపీఐ లైట్ ఫీచర్
రోజురోజుకూ యూపీఐ చెల్లింపులు పెరుగుతున్నాయి. చిన్న చిన్నవాటికి కూడా యూపీఐని వాడుతున్నారు. ఏ చిన్న వస్తువు కొనుగోలు చేసినా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు చెల్లించేస్తున్నారు. దీనికోసం యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పిన్ ఎంటర్ చేసే అవసరం లేకుండా మరింత సులభంగా చెల్లింపులు జరిగే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) యూపీఐ లైట్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. గతేడాది సెప్టెంబర్‌లోనే దీనిని ప్రవేశపెట్టగా పేటీఎం ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. తాజాగా ఫోన్‌పే కూడా యూపీఐ లైట్ ఫీచర్ తీసుకొచ్చింది.
యూపీఐ లైట్ అంటే : చిన్నమొత్తాల డిజిటల్ చెల్లింపుల కోసం తీసుకొచ్చిన అందుబాటులోకి తీసుకొచ్చిన ఫచరే యూపీఐ లైట్ సాధారణంగా పేమెంట్ చేయాలంటే యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ యాక్టివేట్ చేసుకుంటే సింగిల్ క్లిక్‌తో పిన్ ఎంటర్ చేసే పనిలేకుండా చెల్లింపులు చేయొచ్చు. దీనికోసం వ్యాలెట్‌లో కొంత మొత్తం యాడ్ చేయాలి. గరిష్ఠంగా రూ.2 వేల వరకు యాడ్ చేసుకోవచ్చు. రూ.200 వరకు లావాదేవీని సింగిల్ క్లిక్‌తో పూర్తి చేయొచ్చు. బ్యాంక్ సేవల్లో అంతరాయం ఉన్నప్పటికీ పేమెంట్ కు ఎటువంటి ఇబ్బంది ఏర్పడదు. దీన్ని ఎలా యాక్టివేట్ చేయాలంటే..

ఈ ఫీచర్ పొందాలంటే ముందుగా ఫోన్‌పే యాప్ లేటెస్ట్ వెర్షన్‌ను వాడుతుండాలి. ఫోన్‌పే యాప్ ఓపెన్ అయిన తర్వాత హోమ్ స్క్రీన్‌పై 'UPI Lite' ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. యూపీఐ లైట్ ఖాతాలో ఎంతైతే జమ చేయదలుచుకున్నామో ఆ మొత్తాన్ని ఎంటర్ చేసి బ్యాంక్ అకౌంట్‌ను ఎంచుకోవాలి. యూపీఐ పిన్ ఎంటర్ చేయగానే 'UPI Lite' అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. తర్వాత ఏ క్యూర్ కోడ్‌నైనా స్కాన్ చేసి నగదు చెల్లింపులు పూర్తిచేయవచ్చు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications