వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏఏపీ ఎంపీ వీడియో రగడ: కేవీపీ బిల్లు ఎఫెక్ట్, అదే దారిలో జగన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ప్రవేశ పెట్టిన బిల్లు పైన ఈ రోజు చర్చ, ఓటింగ్ జరుగుతుందా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే దీనిని అడ్డుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోందనే చర్చ సాగింది.

మోడీని ఇరికించిన కేవీపీ: టార్గెట్ 19 రివర్స్ అవుతోందా?

ఇదే సమయంలో, ఉభయ సభల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మన్ వీడియో వేడి రాజుకుంది. దీని పైన ఉభయ సభలు వేడెక్కాయి. లోకసభ సోమవారానికి వాయిదా పడింది. అనంతరం రాజ్యసభ మధ్యాహ్నం గం.2.30 గంటలకు వాయిదా పడింది.

ఇదీ ఏఏపీ ఎంపీ వీడియో రగడ

మద్యం మత్తులోనే పార్లమెంటు సమావేశాలకు హాజరవుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఏపీ ఎంపీ భగవత్ మాన్ తాజాగా మరోసారి వివాదానికి కేంద్రబిందువు అయ్యారు. మద్యం మత్తులో పార్లమెంటులోకి వచ్చిన తనను అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బందిపై చిందులు తొక్కారంటూ ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Uproar Over AAP MP Bhagwant Mann's Parliamen

ఈ నేపథ్యంలో మాన్‌ను తక్షణమే సభ నుంచి సస్పెండ్ చేయాలని అధికార పక్షం బీజేపీ వాదిస్తోంది. అయితే ఈ సమయంలోనే భగవత్ మరో దుస్సాహసానికి పాల్పడ్డారు. తానేమీ తప్పు చేయలేదని చెప్పడానికి ఆయన చేసిన ఈ దుస్సాహసం ఆయన మెడకే చుట్టుకుంది.

బీజేపీ మెలిక: గొడవ పెట్టుకోమని టీజీ వ్యాఖ్య, బీజేపీ ప్లాన్

తాను ఇంటి వద్ద బయలుదేరినప్పటి నుంచి పార్లమెంటు ఆవరణలోని లోకసభ లోపలికి వెళ్లే దాకా అన్ని పరిణామాలను వీడియో తీసిన ఆయన సదరు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పార్లమెంటు ఆవరణలో వీడియో చిత్రీకరణ నిషిద్ధం.

ఏ పార్టీ బలమెంత: కేవీపీ బిల్లు నెగ్గితే ఏమవుతుంది?

ఈ నేపథ్యంలో భగవత్ చేసిన ఈ దుస్సాహసంపై బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తక్షణమే భగతవ్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్... భగవత్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ విషయమై రాజ్యసభ అట్టుడుకుతోంది. ఏఏపీ ఎంపీ వివాదం నేపథ్యంలో కేవీపీ బిల్లుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వైవీ సుబ్బారెడ్డి ప్రయివేటు బిల్లు

ఇప్పటికే, రాజ్యసభలో కేవీపీ ప్రత్యేక హోదా పైన ప్రయివేటు మెంబర్ బిల్లు పెట్టి రాజకీయ వేడి రాజేశారు. ఆయన దారిలోనే వైసిపి నడవనుంది. వైసిపి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోకసభలో హోదా పైన ప్రయివేటు మెంబర్ బిల్లు ప్రవేశ పెట్టనున్నారని తెలుస్తోంది.

English summary
Uproar Over AAP MP Bhagwant Mann's Parliament Video: suspense on KVP Ramachandra Rao's bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X