• search
For amaravati Updates
Allow Notification  

  ఘనంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మునిమనవరాలి వివాహం(ఫొటోలు-వీడియో)

  |
   ఘనంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మునిమనవరాలి వివాహం

   చెన్నై/హైదరాబాద్: తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ముని మనుమరాలు సంజనరెడ్డి వివాహం చెన్నై నగరంకు చెందిన ప్రతాప్ రెడ్డి‌తో హైదరాబాద్ జెఆర్‌సి కన్వెన్షన్‌లో గత ఆదివారం ఘనంగా జరిగింది.

   ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మనవరాలి వివాహం

   ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మనవరాలి వివాహం

   ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు సంజనరెడ్డి తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డి, సుచరితలు ఆహ్వానితులకు స్వాగతం పలికారు. తమిళనాడు తెలుగు యువ శక్తి అధ్యక్షుడు, దక్షిణ భారత ఉయ్యాలవాడ సేవ సేన కన్వీనర్, సినీ నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, సినీ నటుడు సుమన్ హాజరయ్యారు.

   అంగరంగ వైభవంగా..

   అంగరంగ వైభవంగా..

   అంగరంగ వైభవంగా జరిగిన వివాహా కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి అఖిలప్రియ, పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకరరెడ్డి, శాసనసభ్యులు సూర్యనారాయణ, బీసీ.జనార్ధనరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిలతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విశ్వేశ్వరరెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

   మేమే సినిమా తీద్దామనుకున్నాం..

   మేమే సినిమా తీద్దామనుకున్నాం..

   ఉయ్యాలవాడ ముని మనవడు పెళ్లి కుమార్తె తండ్రి మాట్లాడుతూ.. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను గతంలో మేమే చలనచిత్రంగా నిర్మించాలనుకొన్నాము. అప్పట్లో ఈ విషయమై సుమన్‌ను సాయికుమార్‌ను కూడా సంప్రదించడం జరిగిందని, ఉయ్యాలవాడ మెమోరియల్‌గా మా ప్రాంతంలో తీర్చిద్దేందుకు ఇప్పటికే వారి విగ్రహంను కూడా చేయించటం జరిగిందని, త్వరలో ఆ విగ్రహాప్రతిష్టాపన, మెమోరియల్ హాల్ నిర్మాణం ప్రారంభించనున్నాం' అని తెలిపారు.

   సంతోషంగా ఉంది..

   ‘టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా.. ఆయన తనయుడు రాంచరణ్ సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ జీవితంను సినిమాగా తియ్యటం చాలా సంతోషం. ముఖ్యంగా వాడ.. వాడల తిరిగి తొలి స్వాతంత్ర్య సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని జాతీయ వీరుడుగా గుర్తించాలని అన్ని రాష్ట్రాలలో తిరిగి సంతకాల సేకరణ కార్యక్రమంను చేప్పట్టిన దక్షిణ భారత ఉయ్యాలవాడ సేవ సేన కన్వీనర్ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డికి ధన్యవాదాలు' అని పెళ్లి కుమార్తె తండ్రి తెలిపారు. ఈ వివాహా మహోత్సవంనకు విచ్చేసిన అతిరథమహారధులకు తన కృతజ్ఞతలను ఆయన ఒక ప్రకటనలో తెలిపారు .

    ఉయ్యాలవాడగా చిరంజీవి..

   ఉయ్యాలవాడగా చిరంజీవి..

   ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సిపాయి ల తిరుగుబాటు కంటే ముందు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల శక్తులను గజగజ లాడించిన తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు. వారి జీవిత చరిత్ర ఆధారం గా రాంచరణ్ చిత్రంను ‘సైరా నరసింహారెడ్డి' పేరుతో నిర్మిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి ఈ చిత్రం లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో అలరించనున్నారు. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం విడుదలైన టీజర్ ఇప్పుడు తెలుగు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

   తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

   మరిన్ని అమరావతి వార్తలుView All

   English summary
   Freedom fighter Uyyalawada Narasimha Reddy Grand Daughter Marriage held in Hyderabad.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   Notification Settings X
   Time Settings
   Done
   Clear Notification X
   Do you want to clear all the notifications from your inbox?
   Settings X
   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more