ఏంటీ.. ఆ స్టార్ హీరోయిన్ 'గే' నా..? ఫైనల్ గా ఓపెన్ అయిన విశ్వంభర బ్యూటీ

వయసు పెరుగుతున్నా అందంలో మాత్రం తగ్గేదేలే అంటోంది మౌనీ రాయ్.. రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. ఆమె అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.. సూపర్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే సెలబ్రిటీల జీవితం తెరిచిన పుస్తకమే.. తమ లైఫ్ లో ఏ చిన్న విషయం జరిగినా సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్ తో పంచుకోవడం వారికి అలవాటే.. అలా నిత్యం తమ అభిమానులతో టచ్ లో ఉండటం సెలబ్రిటీస్ కు ఇష్టం కూడా.. అయితే హీరోయిన్ మౌనీ రాయ్ లైఫ్ చుట్టూ ఇటీవల అనేక విమర్శలు వస్తున్నాయి. ఆమె తన భర్త సూరజ్ నంబియార్‌తో విడిపోయిన తర్వాత ఆ విమర్శలు ఎక్కువయ్యాయి.

ఇటీవల కొందరు నెటిజన్లు హద్దుమీరి మరీ మౌనీ రాయ్ గే అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే దీనిపై ఆమె తాజాగా స్పందించింది. ఈ మేరకు తాను 'గే' అంటూ వస్తున్న రూమర్స్ ను ఆమె ఖండించింది. తాను 'గే' కాదని తేల్చి చెప్పింది. తాను విన్న అత్యంత అబద్ధమైన రూమర్ ఇదేనని తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. ఈ మేరకు ఇటీవల మోనికా శర్మ యూట్యూబ్ ఛానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మౌనీ రాయ్ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చింది.

అయితే ఈ రూమర్స్ కారణం ఏంటంటే..? మౌనీ రాయ్.. తన క్లోజ్ ఫ్రెండ్ దిశా పటానీతో సన్నిహితంగా ఉంటూ వస్తోంది. ఇద్దరూ కలిసి తరచూ వెకేషన్స్ కు వెళ్లడం.. సామాజిక మాధ్యమాల్లో సన్నిహితంగా ఉన్న ఫోటోలు పోస్ట్ చేయడం చూసి నెటిజన్లు మౌనీ రాయ్ గే అంటూ ప్రచారం చేపట్టారు. ఈ మేరకు వారి స్నేహాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇక ఇదే సమయంలో భర్తతో విడిపోవడంతో ఆ రూమర్స్ కు బలం చేకూరింది. దాంతో ఈ ఊహాగానాలకు తాజాగా మౌనీ రాయ్ ఇప్పుడు పరోక్షంగా సమాధానం ఇచ్చినట్లు అయింది.

MouniRoy Shocks Fans with Bold Statement I Am Not Gay Actress Addresses Rumours MouniRoy gay

ఇక మౌనీ రాయ్ కెరీర్ విషయానికి వస్తే ఆమె 2018 నుంచి బాలీవుడ్ లో హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇటీవలే దర్శకుడు డేవిడ్ ధావన్ తెరకెక్కించిన హై జవానీ తో ఇష్క్ హోనా హై చిత్రంలో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. అయితే మౌనీ రాయ్ 2018 లో అక్షయ్ కుమార్ తో గోల్డ్ సినిమాలో నటించింది. ఆ తర్వాత రోమియో అక్బర్ వాల్టర్, మేడ్ ఇన్ చైనా, లండన్ కాన్ఫిడెన్షియల్, వెల్లే, బ్రహ్మాస్త్ర, బ్లాక్ అవుట్.. తదితర చిత్రాల్లో నటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+