మావా.. అదేం క్లైమాక్స్ రా!మెంటల్ లేచింది.. చివరి 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో క్రైమ్ అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా 'దృశ్యం' లాంటి కల్ట్ థ్రిల్లర్‌ను అందించిన మాస్టర్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఒక సినిమాను నిర్మిస్తున్నారంటే సస్పెన్స్ లవర్స్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. అలా ఆయన నిర్మాణంలో, మార్టిన్ జోసెఫ్ దర్శకత్వంలో షేన్ నిగమ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సరికొత్త మలయాళ క్రైమ్ థ్రిల్లర్ 'దృఢం'. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియో హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ అవుతూ డిజిటల్ ఆడియన్స్‌ను సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ సినిమా కథాంశం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. విజయ్ రాధాకృష్ణన్ అనే ఒక యంగ్ పోలీస్ ఆఫీసర్‌కు ఒక హిల్ స్టేషన్ పరిధిలోని ప్రశాంతమైన రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా మొదటి పోస్టింగ్ వస్తుంది. పెద్దగా క్రైమ్ రికార్డ్స్ లేని ఆ ఏరియాలో చాలా ప్రశాంతంగా డ్యూటీ చేసుకోవచ్చని విజయ్ భావిస్తాడు. కానీ, ఊహించని విధంగా అక్కడొక కుళ్ళిపోయిన శవం బయటపడుతుంది. ఆ షాక్ నుంచి తేరుకోకముందే ఒక లోకల్ బ్యాంక్ రాబరీ, వెనువెంటనే మరో రెండు ఘోరమైన హత్యలు జరుగుతాయి. ఒకేసారి వరుసగా జరిగిన ఈ క్రైమ్స్ వల్ల పబ్లిక్ నుంచి, పై అధికారుల నుంచి విజయ్‌పై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు రంగంలోకి దిగిన విజయ్.. ఒక్కో క్లూను సేకరిస్తూ ఈ మిస్టరీని ఎలా ఛేదించాడనేదే మిగతా కథ.

drudham-movie-that-dude-what-a-climax-it-blew-my-mind-the-last-20-minutes-were-on-another-lev

రివీల్ అయ్యేసరికి అవాక్కవుతారు..

మలయాళ నేటివిటీకి తగ్గట్టుగా సినిమా ప్రారంభంలో కథ కాస్త నెమ్మదిగా, రొటీన్ క్రైమ్ ప్రొసీజర్ తరహాలోనే సాగుతుంది. ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు కాస్త సాగదీసినట్టు, డైలాగ్స్ కాస్త స్పూన్ ఫీడింగ్‌లా అనిపించినా.. హీరో విజయ్ ఎప్పుధైతే ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేస్తాడో, అప్పటినుంచి కథలో వేగం పెరుగుతుంది. ఈ సినిమాకు అతిపెద్ద అస్సెట్ చివరి 20 నిమిషాల క్లైమాక్స్ ఎపిసోడ్ అని చెప్పాలి. ఎవరూ ఊహించని విధంగా వచ్చే ఆ అల్టిమేట్ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్, క్లైమాక్స్‌లో వచ్చే హై-వోల్టేజ్ వైల్డ్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను సీటు ఎడ్జ్ లో కూర్చోబెడతాయి. "ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు" అన్నట్టు.. విజయ్ చుట్టూ ఉన్నవారే ఆ నేరాలకు పాల్పడ్డారని తెలిసినప్పుడు కలిగే షాక్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మొదటి నుంచి విజయ్ వెంటపడిన ఒక అమ్మాయి కూడా ఈ క్రైమ్స్ లో భాగస్వామి అని రివీల్ అయ్యే సీన్ ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేస్తుంది. అయితే, హత్యల వెనుక ఉన్న రీజన్ పాత సినిమాల తరహాలోనే కాస్త రొటీన్‌గా అనిపించినప్పటికీ, దానిని క్లైమాక్స్‌లో ఎగ్జిక్యూట్ చేసిన విధానం మాత్రం మెప్పిస్తుంది.

హ్యాపీగా చూడొచ్చు.

నటీనటుల విషయానికొస్తే.. కొత్తగా జాయిన్ అయిన యంగ్ పోలీస్ ఆఫీసర్‌గా, ప్రెజర్ సిట్యుయేషన్స్ తట్టుకునే పాత్రలో షేన్ నిగమ్ అద్భుతమైన బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో నమ్మినవారే మోసం చేశారనే బాధను, పోలీస్ గా కర్తవ్యాన్ని నెరవేర్చాలనే తపనను తన ఎమోషనల్ యాక్టింగ్‌తో పీక్స్‌కు తీసుకెళ్లాడు. సపోర్టింగ్ రోల్స్ చేసిన శోభి తిలకన్, దినేష్ ప్రభాకర్ తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. సాంకేతికంగా చూస్తే.. సినిమాటోగ్రఫీ హిల్ స్టేషన్ మూడ్‌ను పర్‌ఫెక్ట్‌గా క్యాప్చర్ చేయగా, సాయిల్ సాజి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లోని సస్పెన్స్ ఎలిమెంట్స్ ను వేరే లెవెల్‌కు ఎలివేట్ చేసింది. ఫస్ట్ హాఫ్‌లో అక్కడక్కడా వచ్చే స్లో నరేషన్ పక్కన పెడితే... క్లైమాక్స్ ట్విస్ట్ కోసం ఈ వీకెండ్‌లో ఫ్యామిలీతో కలిసి 'దృఢం' సినిమాను హ్యాపీగా ఒకసారి చూసేయొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+