కిరణ్: ఏడ్చిన విహెచ్, సిఎం పోస్ట్ వద్దన: సర్వే(పిక్చర్స్)

హైదరాబాద్: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పట్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి తీరుపై కలత చెందిన కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు మంగళవారం కన్నీరుకార్చారు. ఇందిర గాంధీ జయంతిని పురస్కరించుకొని గాంధీ భవన్‌లో పలువురు నేతలు నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, మంత్రులు దానం నాగేందర్, జానా రెడ్డి, ఎంపి వి హనుమంత రావు తదితరులు పాల్గొని పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అధినేత్రి పైన కిరణ్ వైఖరి తీరు పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేసిన విహెచ్ కంటతడి పెట్టారు. సోనియా పట్ల కిరణ్ తీరు బాగాలేదని ఆయన ఏడ్చారు.

విభజనతో ఇన్ని సమస్యలు వస్తాయని రోడ్డు మ్యాప్ అడిగినప్పుడే కిరణ్ ఎందుకు చెప్పలేదని విహెచ్ ప్రశ్నించారు. కిరణ్ మాటలు వింటుంటే రాత్రి నిద్ర పట్టలేదన్నారు. తన పేరులో రావు ఉంది కాబట్టి సిఎం పదవి రాలేదన్నారు. ఆ పదవి వచ్చేందుకు అదృష్టం ఉండాలన్నారు. విభజన జరిగితే ఉగ్రవాదం, తీవ్రవాదం పెరిగి దేశవ్యాప్తంగా ముప్పు ఉందన్న కిరణ్ వ్యాఖ్యలు సరికాదన్నారు.

సిఎం పదవి వద్దనే దమ్ము లేదు: సర్వే

తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే వద్దనే దమ్ము తనకు లేదని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ చెప్పారు. ముఖ్యమంత్రి పదవి కోరుకుంటే వచ్చేది కాదన్నారు. ఇందిరా గాంధీ తెలంగాణను ఏనాడు వ్యతిరేకించలేదని చెప్పారు. ప్యాకేజీల సమయం అయిపోయిందని, ప్యాకేజీలకు తెలంగాణ ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదన్నారు.

ఇందిరకు కిరణ్ నివాళీ

ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కిరణ్ నెక్లెస్ రోడ్డులోని ఆమె విగ్రహం వద్ద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సర్వే సత్యనారాయణ, చక్రపాణి, బొత్స, మంత్రి దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఇందిర 1

ఇందిర 1

దివంగత ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ భవన్‌లో ఆమె చిత్ర పటానికి నివాళులు అర్పిస్తున్న పిసిసి చీఫ్ బొత్స, కేంద్రమంత్రి సర్వే, ఎంపి విహెచ్.

ఇందిర 2

ఇందిర 2

దివంగత ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ భవన్‌లో ఆమె చిత్ర పటానికి నివాళులు అర్పిస్తున్న పిసిసి చీఫ్ బొత్స, కేంద్రమంత్రి సర్వే, ఎంపి విహెచ్. సర్వేతో మాట్లాడుతున్న బొత్స

ఇందిర 3

ఇందిర 3

దివంగత ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ భవన్‌లో ఆమె చిత్ర పటానికి నివాళులు అర్పిస్తున్న పిసిసి చీఫ్ బొత్స, కేంద్రమంత్రి సర్వే, ఎంపి విహెచ్. సర్వేతో మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ

ఇందిర 4

ఇందిర 4

దివంగత ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ భవన్‌లో ఆమె చిత్ర పటానికి నివాళులు అర్పిస్తున్న బొత్స, సర్వే, దానం నాగేందర్ తదితరులు.

ఇందిర 5

ఇందిర 5

దివంగత ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+