వాస్తుదోషం: ఏపీ సచివాలయానికి ఐదోగేటు

ఏపీ సచివాలయానికి ఐదో గేటును ఏర్పాటుచేస్తున్నారు.వాస్తు నిపుణుల సూచనల మేరకు ఈ మార్పును చేయనున్నారు.సిఎం కాన్వాయ్ కోసం మంత్రుల చాంబర్ వెనుక నుండి దారిని ఏర్పాటుచేశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో వాస్తు మార్పులు చేస్తున్నారు. వాస్తు నిపుణుల సూచనల మేరకు సచివాలయంలో మార్పులు చేర్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వాస్తు పండితుల సూచనల మేరకు పలు మార్పులను చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో వాస్తు మార్పులు చేయాలని కొంత కాలంగా వాస్తు నిపుణులు సూచించారు.అయితే ఈ సూచన మార్పులకు సర్కార్ శ్రీకారం చుట్టింది. సచివాలయంలోని 4, 5 బ్లాక్ లలో మరో గేటును ఏర్పాటుచేయలని నిపుణులు సూచించారు.

Vaastu changes made in Andhra pradesh secretariat

ఈ గేటు నిర్మాణం కోసం ప్రహరీ గోడను కూల్చివేశారు. 5వ, గేటు కూడ ఉండాలని వాస్తు పండితులు సూచించారు.ఈ మేరకు వాస్తు మార్పులు చేస్తున్నారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వాస్తునిపుణుల సూచనల మేరకు రెండవ గేట్ నుండి సచివాలయానికి వెళ్తున్నారు.

గతంలో ఆయన ఒకటో నెంబర్ నుండి సచివాలయానికి వెళ్ళేవారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాన్వాయ్ కోసం మంత్రుల బ్లాక్ ల వెనుక ఉన్న రహదారిని ఎమర్జెన్సీ రహదారిగా మార్చివేశారు.

ఆ రహదారిలో ఎలాంటి వాహనాలు పెట్టరాదని ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే మంత్రుల ఛాంబర్లతో పాటు వివిధ నిర్మాణాలకు సంబంధించిన పలు దపాలు మార్పులు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+