తొక్కిసలాటతో వైకుంఠ ద్వారా దర్శన టోకెన్లపై టీటీడీ తాజా నిర్ణయం..!!

తిరుపతిలో తొక్కిసలాట విషాదం మిగుల్చింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్ల జారీకి తిరుపతి లో ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేసారు. టోకెన్లు పొందేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. దీంతో, జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు క్షత గాత్రులై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మూడు రోజుల దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీ ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 13న తిరిగి టోకెన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది.

టోకెన్ల జారీ
వైకుంఠ ద్వార దర్శనం కోసం ఈ నెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేసిన ఎస్డీ టోకెన్ల కోటా పూర్తయింది. రోజుకు 40 వేల మందికి అవకాశం కల్పిస్తూ మూడు రోజులకు సంబంధించి లక్షా 20 వేల టోకెన్లను టీటీడీ జారీ చేసింది. దాదాపు 13 గంటల పాటు 9 కేంద్రాల్లో భక్తులకు టోకెన్స్ జారీ చేశారు. ఈ నెల 10వ తేదీ నుంచి 19 వరకు తిరుమల లో శ్రీవారి దర్శనం కోసం వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచనున్నారు. మిగిలిన రోజులకు సంబంధిం చిన టోకెన్స్‌ను ఏ రోజుకు ఆ రోజే జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది.

Vaikunta Dwara Darshanam Three days SD Tickets completed again counters open on 13th

టీటీడీ తాజా నిర్ణయం
అందులో భాగంగా 13 వ తేదీ ఉదయం తిరుపతిలోని భూదేవి, కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలో నిత్యం 40 వేల టోకెన్లను టీటీడీ అధికారులు జారీ చేయనున్నారు. 19 వ తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనం కోసం ఎస్డీ టోకెన్లను జారీ చేయాలని నిర్ణయించారు. నిన్నటి (బుధ వారం) ఘటన నేపథ్యంలో టోకెన్స్ జారీ చేసే కేంద్రాల వద్ద పటిష్టమైన క్యూ లైన్లతో పాటుగా భక్తు లు ఒకే చోట పెద్ద సంఖ్యలో చేరకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టీటీడీ విజిలెన్స్‌తో పాటు పోలీసులతో గట్టి బందోబస్త్ ఏర్పాటు చేయనున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా నియమించనున్న సీనియర్ అధికారుల పర్యవేక్షణలో టోకెన్స్‌ను టీటీడీ జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది.

అధికారుల సూచనలు
తిరుపతిలో తొక్కిసలాట పైన రెండు కేసులు నమోదయ్యాయి. వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక దర్శనం టోకెన్ల జారీకి తిరుపతిలోని 90 కేంద్రాల్లో టీటీడీ ఏర్పాట్లు చేసింది. గురువారం అర్ధరాత్రి నుంచి తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. దీని కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. తొక్కిసలాట ఘటన తరువాత టోకెన్ల జారీ ప్రక్రియలో టీటీడీ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇక, టోకెన్ల జారీ పూర్తి కావటంతో.. ఈ నెల 13వ తేదీ నుంచి జారీ చేసే టోకెన్ల విషయంలో పలు సూచనలు చేస్తోంది. భక్తులు సైతం పూర్తి స్థాయిలో సహకరించాలని టీటీడీ కోరుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+