వైకుంఠ ఏకాదశి వేడుకలు -శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ : ఉత్తర ద్వార దర్శనాలు..!!
ముక్కోటి పర్వదిన వేడుకలు అర్ద్రరాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆలయాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొన్ని ఆలయాలల్లో కరోనా కారణంగా వైకుంఠద్వార దర్శనాలు రద్దు చేసినట్లు ఆయా ఆలయాల అధికారులు ప్రకటించారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి.
Recommended Video

అర్దరాత్రి తెరుచుకున్న వైకుంఠ ద్వారం
అర్ధరాత్రి 12.05 గంటలకు వైకుంఠ ద్వారం తెరచుకుంది. శ్రీవారి ఆలయంలో ధనుర్మాస పూజలు నిర్వహించిన అర్చకులు.. 1.45 నుంచి స్వామివారి దర్శనం కల్పించారు. సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులు వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు. భారత్ బయోటెక్ సంస్థ అధినేత కృష్ణ ఎల్లా ఆయన సతీమణి సుచిత్ర ఎల్లాతో కలిసి బాలాజీని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా భారత్ బయోటెక్ సంస్థ తరఫున.. శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు రూ.2కోట్ల విరాళాలను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌కు అందజేశారు. శ్రీవారిని పలువురు హైకోర్టుల న్యాయమూర్తులు.. రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు సైతం శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

తిరుమలలో ప్రముఖుల దర్శనాలు
ఏపీ మంత్రులు నారాయణ స్వామి.. వెల్లంపల్లి శ్రీనివాస్.. రంగనాధ రాజు.. అవంతి శ్రీనివాస్.. అనిల్ కుమార్ యాదవ్.. సురేష్..బాలినేని శ్రీనివాస రెడ్డితో పాటుగా తెలంగాణ మంత్రులు హరీష్ రావు.. గంగుల కమలాకర్ ఉన్నారు. మరి కాసేపట్లో స్వామి వారు రధంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ముక్కోటి సందర్భంగా తీరొక్క పూలు, విద్యుత్ కాంతుల వెలుగులో వెంకన్న ఆలయం వెలిగిపోతోంది.
ఇక వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవడానికి ఇప్పటికే భక్తులు భారీగా తిరుమల చేరుకున్నారు. తొలిసారి వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ భక్తుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 13వ తేదీ నుంచి 22 వరకు భక్తులు శ్రీవారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకోనున్నారు.

భక్తులతో పోటెత్తిన ప్రముఖ దేవాలయాలు
వైకుంఠ ద్వార దర్శనంలో భాగంగా టీటీడీ ఇప్పటికే భక్తులకు రోజుకు 20 వేల మందికి 300 రూపాయల టికెట్లు, 5వేల మందికి ఆఫ్ లైన్ లో, 5 వేల మందికి ఆన్ లైన్ లో ఉచిత దర్శనం టోకెన్లు టీటీడీ జారీ చేసింది. మరోవైపు శ్రీవాణి ట్రస్ట్, విఐపిలకు అదనంగా దాదాపు మరో10 వేల టిక్కెట్లను జారీ చేయనున్నది. భక్తుల రద్దీ తగిన విధంగా కరోనా నిబంధనలు పాటిస్తూ.. టిటిడీ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇక, వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి సందర్భంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంతోపాటు, పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు గురువారం ఆంతరంగికంగానే నిర్వహించనున్నట్లు ఈఓ గీతారెడ్డి వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు దేవాలయాల్లో ఇప్పటికే భక్తులు భారీగా తరలి వచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
-
సపోటా పండులో విషం పెట్టి రెండేళ్ళ కూతుర్ని చంపేసిన తండ్రి.. ఆపై -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications