నాన్న, చిన్నాన్నల్లో షర్మిల ఎవరిని గౌరవిస్తారు..!!
ఏపీ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కడప కేంద్రంగా కొత్త రాజకీయం తెర మీదకు వచ్చింది. కడప నుంచి షర్మిల పోటీ చేస్తున్నారు. వివేకా కేసులో జగన్, అవినాష్‌రెడ్డిపై సంచలన కామెంట్స్ చేస్తున్నారు. సోదరి సునీత మద్దతుగా నిలుస్తున్నారు. కడప కేంద్రంగా వివేకా కేసు గురించి జగన్ కీలక కామెంట్స్ చేసారు. ఎన్నికల ప్రచారంలో షర్మిల ప్రదీ ప్రాంతంలో వివేకా కేసు గురించి ప్రస్తావన చేస్తన్నారు. దీంతో, వైసీపీ నేతలు సీరియస్ గా స్పందించారు.
వైయస్ఆర్‌సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ కాంగ్రెస్ నేత షర్మిల పైన సంచలన కామెంట్స్ చేసారు. చంద్రబాబును మించిన ఊసరవెల్లిలా షర్మిల మారుతున్నారని విమర్శించారు. వివేకా కేసులో జరుగుతున్న రాజకీయాలను కడప ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు కంటే ఎక్కువ యూటర్న్‌లు తీసుకుంటన్నారని చెప్పారు. వైయస్సార్ చనిపోయాక వివేకానందరెడ్డి వైయస్ కుటుంబంనుంచి పూర్తిగా డీవియేట్ అయి ఓ మంత్రి పదవికోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి జగన్ ,వైయస్ బిడ్డలకు వ్యతిరేకంగా ఆరోజున రాజకీయం చేసింది కడప ప్రజలు చూడలేదా అని నిలదీసారు.

వైయస్ వివేకానందరెడ్డిని ఎంఎల్సీ ఎన్నికలలో ఓడించడానికి ప్రయత్నించి, ఇప్పుడు షర్మిల పక్కన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుతో షర్మిల చిక్కుకోవడమే మా దురదృష్టం...చంద్రబాబు అదృష్టం అన్నారు. నాడు పులివెందుల నుంచి విజయమ్మకు వ్యతిరేకంగా వివేకాను నిలపటంలో సునీత కుటుంబం ప్రోత్సహించింది నిజం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాను విభజన చట్టంలో పెట్టకుండా అన్యాయం చేసిందని షర్మిల నాడు చెప్పారని గుర్తు చేసారు. అసలు షర్మిల తెలంగాణాలో పార్టీ ఎందుకు పెట్టారు.ఎందుకు ఎత్తేశారో చెప్పాలన్నారు. ఇప్పుడు ఏపిలో ల్యాండ్ అయ్యారు.ఇక్కడ పిసిసి అధ్యక్షుడై ఈరోజు ఆంధ్రగడ్డ..కడప బిడ్డ అంటూ మాట్లాడుతున్నారన్నారు.

ఆరోజు ఎందుకు ఏపి ప్రజలకు వ్యతిరేకంగా నిలబడాలని ఎందుకు అనుకున్నారు.లేదు..లేదు అదంతా తూచ్ అని నేడు ఎందుకు అంటున్నారని నిలదీసారు. షర్మిల చేస్తున్న రాజకీయం రాజశేఖరరెడ్డికి తలవంపులు తెచ్చేలా ఉందన్నారు. నేడు రాష్ర్టంలో దోషిగా నిలబడిన కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల మాట్లాడుతున్న పధ్దతి అత్యంత బాధాకరంగా ఉందని వివరించారు.రాజకీయాల కోసం మీరు ఏమైనా చేస్తారా అని ప్రశ్నించారు. నాడు ఇంటర్వ్యూలో షర్మిల నాన్న(వైయస్సార్)కు నేను రాజకీయాలలోకి రావడం ఇష్టం లేదు అని.....రాజకీయాలకు దూరంగా తనను ఉంచాలని కోరుకున్నారని కూడా చెప్పారన్నారు. కాని చిన్నాన్న ఏమో తను(షర్మిల) ఎంపి కావాలని కోరుకున్నారు. ఇంత విరుధ్దమైన కోరికలు...అంటే నాన్నను గౌరవిస్తారా...చిన్నాన్నను గౌరవిస్తారా....ఏంటి రాజకీయం..సమాధానం చెప్పాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేసారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications