బెంగళూరులో ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి అరెస్ట్
నెల్లూరు/బెంగళూరు: నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. నకిలీ పత్రాలతో రుణాలు తీసుకున్న కేసులో సీబీఐ అధికారులు ఆయనను బెంగళూరులో అరెస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో కేసు విచారణ నిమిత్తం ఆయనను బెంగళూరుకు పిలిపించిన సీబీఐ అధికారులు అక్కడ అరెస్ట్ చేశారు. ఐఎఫ్‌సిఐ నుంచి 180 కోట్ల రూపాయల రుణం తీసుకున్న వాకాటి శామీర్‌పేటలోని 12 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని 240 కోట్ల రూపాయల స్థలంగా చూపి రుణం పొందారని అభియోగాలున్నాయి.

రుణం చెల్లించకపోవడంతో ఐఎఫ్‌సిఐ సిబిఐకి ఫిర్యాదు చేసింది. కాగా, వాకాటిపై అవినితి ఆరోపణలు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.












Click it and Unblock the Notifications