బాబు రాక: పోలీసులతో వల్లభనేని వాగ్వాదం, ఉద్రిక్తం

తాము, తమ పార్టీ కార్యకర్తలు రోడ్డుకు పక్కన నిలుచున్నారని, అలాంటప్పుడు తమను వీడియో ఎందుకు తీస్తున్నారని వల్లభనేని పోలీసులను ప్రశ్నించారు. వీడియో తీసి బెదిరించాలనుకుంటున్నారా అన్నారు. పోలీసులు ఉన్నది ప్రజలను భయపెట్టేందుకా లేక రక్షించేందుకా అన్నారు.
పోలీసులు అతిగా ప్రవర్తించవద్దన్నారు. చట్ట ప్రకారం నడుచుకోవాలన్నారు. పోలీసులు కాంగ్రెసు పార్టీకి లేదా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కొమ్ము కాస్తున్నారా చెప్పాలన్నారు. పోలీసులు ప్రజలను భయపెట్టేందుకు లేరన్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ టిడిపి కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
మరోవైపు తాము వీడియో తీస్తుంటే.. ఎందుకని ప్రశ్నిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. కావాలనే ఆయన వివాదం పెట్టుకున్నారన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున టిడిపి ఫ్లెక్సీలు తొలగించినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications