సీతారామాంజనేయులు నుండి హానీ: డిజిపికి వల్లభనేని

ఓ డైరెక్టర్ ఇచ్చిన సమాచారంతో వంశీ అప్రమత్తమై ప్రస్తుత పోలీసు కమిషనర్ శ్రీనివాసులను కలిశారట. ఆయన సూచనలతో వంశీ సోమవారం సాయంత్రం డిజిపిని కలిశారు. సీతారామాంజనేయులుతో తనకు గల వివాదాన్ని వంశీ డిజిపికి వివరించినట్లుగా తెలుస్తోంది.
గతంలో ఓ మహిళ విషయంలో వల్లభనేని వంశీ, సీతారామాంజనేయులు మధ్య వివాదం వచ్చింది. దాంతో తన పైన కక్ష పెట్టుకున్న సీతారామాంజనేయులు తన సంగతి తేలుస్తానని హెచ్చరిస్తున్నారని వంశీ చెప్పినట్లుగా తెలుస్తోంది.
కాగా, విజయవాడలో అన్నపూర్ణ ప్యాకేజీస్ సంస్థకు సంబంధించిన వివాదంలో వారి మధ్య వివాదం ప్రారంభమైంది. ఆ తర్వాత సీతారామాంజనేయులు విజయవాడలోని ఓ మహిళను లైంగికంగా వేధింపులకు గురి చేసినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో ఇరువురి మధ్య వివాదం ముదిరిందంటారు.
మరోవైపు వల్లభనేని వంశీ డిజిపికి ఫిర్యాదు చేసిన విషయం తనకు తెలియదని సీతారామాంజనేయులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications