ఎన్టీఆర్‌ను లోకేష్ ఆహ్వానించటం జోక్.. శిశువుల డాక్టర్ కథ చెప్పనా చంద్రబాబు: వల్లభనేని వంశీ
జూనియర్ ఎన్టీఆర్ విషయంలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై, అలాగే అలాగే గన్నవరం ఉద్రిక్తతలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వల్లభనేని వంశీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
జూనియర్ ఎన్టీఆర్ విషయంలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై, అలాగే అలాగే గన్నవరం ఉద్రిక్తతలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వల్లభనేని వంశీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ని లోకేష్ పార్టీలోకి ఆహ్వానించడం పెద్ద జోక్ అని ఆయన అభివర్ణించారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ లోకేష్ పై ఈ విషయంలో సెటైర్లు వేశారు. తెలుగుదేశం పార్టీని స్థాపించింది జూనియర్ ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీఆర్ అని పేర్కొన్న ఆయన, లోకేష్ తాత ఖర్జూరపు నాయుడు కాదు టిడిపిని పెట్టింది అంటూ సెటైర్ వేశారు.

లోకేష్ గాలికి తిరుగుతున్నప్పుడే టీడీపీ కోసం పని చేసిన ఎన్టీఆర్: వంశీ
అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు.. జూనియర్ ఎన్టీఆర్ ని లోకేష్ ఆహ్వానించడం హాస్యాస్పదంగా ఉందని వల్లభనేని వంశీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టిడిపి ఎన్టీఆర్ పార్టీ అని ఎప్పటికైనా అది ఎన్టీఆర్ పార్టీనే అవుతుందని వల్లభనేని వంశీ తేల్చి చెప్పారు.లోకేష్ కు బొడ్డు ఊడనప్పుడే, 2009లో తెలుగుదేశం పార్టీలో లేకుండా గాలికి తిరిగినప్పుడే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలను పణంగా పెట్టి గెలుపు కోసం పని చేశారని వల్లభనేని వంశీ లోకేష్ ను టార్గెట్ చేశారు.

టిడిపి జూనియర్ ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ
జూనియర్ ఎన్టీఆర్ పట్ల ఎవరి దయ అవసరం లేదని, ఎవరి ప్రాపకం ఆయనకు అవసరం లేదని పేర్కొన్న వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ పట్ల జూనియర్ ఎన్టీఆర్ కు అన్ని హక్కులు ఉన్నాయని పేర్కొన్నారు. టిడిపి ఆయన తాత సీనియర్ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ కాబట్టి దానిని ఆయన చూసుకోగలరు అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇక ఇదే సమయంలో గన్నవరంలో చోటుచేసుకున్న ఉద్రిక్తత , గన్నవరం చంద్రబాబు పర్యటన, ఆపై ఆయన చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్న వల్లభనేని వంశీ తనదైన శైలిలో రివర్స్ ఎటాక్ చేశారు.

చంద్రబు రాకెట్ కట్టుకుని ఆకాశంలో కూడా ఎగరొచ్చు
దేశంలో ఎవరు ఎక్కడైనా తిరగొచ్చని పేర్కొన్న వల్లభనేని వంశీ, చంద్రబాబు కావాలనుకుంటే ఆది సినిమా తరహాలో అస్సాం వెళ్లొచ్చంటూ వివరించారు. నడుముకి రాకెట్ కట్టుకొని ఆకాశంలోకి ఎగరొచ్చంటూ ఎద్దేవా చేశారు. కావాలంటే గోదావరిలో కూడా దూకొచ్చంటూ సెటైర్లు వేశారు. సెక్షన్ 144, 31 అమలులో ఉన్నప్పుడు పోలీసులు నియంత్రిస్తారని పేర్కొన్న వల్లభనేని వంశీ చంద్రబాబు తాము అధికారంలో ఉన్న సమయంలో ముద్రగడ పద్మనాభం, మందకృష్ణ మాదిగలు రాష్ట్రంలో తిరగకుండా నియంత్రించారంటూ గుర్తు చేశారు.

చంద్రబాబు బాలయ్య సినిమాలు చూడటం వల్లే అలా..
ఇక ఉద్రిక్త పరిస్థితులు ఉండడం వల్లే చంద్రబాబును గన్నవరం వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని, కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకుంటాము అన్నట్టుగా చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. చంద్రబాబు బాలయ్య సినిమాలు ఎక్కువగా చూడటం వల్ల అవే డైలాగులు చెబుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ఇక తనను పశువుల డాక్టర్ అని మాట్లాడుతున్న చంద్రబాబు, తాను తిరుపతిలో చంద్రబాబు శిశువుల డాక్టర్ ను మోసం చేసిన కథ చెప్తే మళ్లీ బోరున ఏడ్చే పరిస్థితి వస్తుందని వల్లభనేని వంశీ వ్యాఖ్యలు చేశారు. తన జోలికొస్తే అనవసరంగా ఏడవాల్సి వస్తుందని వంశీ హెచ్చరికలు జారీ చేశారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications