నా హత్యకు జనవరి 13న కుట్ర: వల్లభనేని వంశీ

తనను చంపేందుకు ఓ ఆయుధం కూడా అందించినట్లు ఆయన ఆరోపించారు. పోలీసు అధికారి సీతారామాంజనేయులు తన హత్యకు నియమించినవారిలో ఓ మాజీ నక్సలైట్ కూడా ఉన్నాడని ఆయన చెప్పారు. మరో అధికారి కూడా సీతారామాంజనేయులుతో పాటు ఉన్నారని ఆయన చెప్పారు.
తనను చంపేందుకు కుట్ర చేశారని నిరూపించడానికి తన వద్ద ఆధారాలున్నాయని, ఫోరెన్సిక్ పరీక్షలు జరిపితే ఆ విషయం తేలుతుందని ఆయన అన్నారు. సీతారామాంజనేయులు నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ తనకు రక్షణ కల్పించాలని వంశీ ఇటీవల డిజిపిని కలిసిన విషయం తెలిసిందే.
ఓ డైరెక్టర్ ఇచ్చిన సమాచారంతో వంశీ అప్రమత్తమై పోలీసు కమిషనర్ శ్రీనివాసులును కలిసినట్లు, ఆయన సూచనలతో వంశీ డిజిపిని కలిసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. సీతారామాంజనేయులుతో తనకు గల వివాదాన్ని వంశీ డిజిపికి వివరించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications