వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వనజాక్షి ఇష్యూ, తెరపైకి సరిహద్దు సమస్య: ఎమ్మెల్యేదీ తప్పేనన్న బాబు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దారు వనజాక్షి పైన జరిగిన దాడి అంశంపై సీనియర్ ఐఏఎస్ అధికారితో విచారణ జరపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు రెవెన్యూ ఉద్యోగులకు హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ఉదయం రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు, బాధితురాలు వనజాక్షితో సమావేశమయ్యారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు నేతృత్వంలో చర్చలు జరిపారు. జరిగిన సంఘటనను బొప్పరాజు ఎపి సీఎంకు చెప్పారు.

దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. సంఘటనకు సంబంధించిన ఫోటోలు, ఇసుక తవ్వకాలకు సంబంధించిన పర్మిట్లను తెప్పించి పరిశీలిచినట్లు చెప్పారు.

వనజాక్షి ఇష్యూ

వనజాక్షి ఇష్యూ

మీ వాదనతో నేను ఏకీభవిస్తున్నానని, ఆమె మంచి అధికారి అని, అయితే అక్కడ సరిహద్దు సమస్య ఉందని, పర్మిట్లు చూపినా ఆమె అడ్డంగా కూర్చొని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని, ఏదైనా నివేదిక ఇవ్వాలి లేదంటే కేసు పెట్టాలని, అలాగని నేను ఎమ్మెల్యేను సమర్థించడం లేదని, అతను చేసింది తప్పేనని చెప్పారు.

 వనజాక్షి ఇష్యూ

వనజాక్షి ఇష్యూ

అలాగే, ఎస్సై కూడా అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదన్నారు. గొడవల వల్ల ఉపయోగం ఉండదని చంద్రబాబు సూచించారు.

వనజాక్షి ఇష్యూ

వనజాక్షి ఇష్యూ

సమావేశం అనంతరం వనజాక్షి మాట్లాడుతూ.. ఇలాంటి గొడవలు జరిగితే ఆదాయం కన్నా ప్రభుత్వానికి ఎక్కువ చెడ్డపేరు వస్తుంది కదా అని వ్యాఖ్యానించారు. సీనియర్ అధికారితో విచారణ జరిపించాలని బాబును కోరామన్నారు.

 వనజాక్షి ఇష్యూ

వనజాక్షి ఇష్యూ

కాగా, ఎమ్మార్వోపై దాడి అంశం, చవరకు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య సరిహద్దులు అనే అంశం తెరమీదకు వచ్చింది.

English summary
Vanajakshi Episode: Chandrababu promises revenue officials
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X