విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వందే భారత్‌ మిషన్‌-ఎల్లుండి నుంచి నేరుగా విజయవాడకు విదేశీ విమానాల రాకపోకలు

|
Google Oneindia TeluguNews

వందే బారత్‌ మిషన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం త్వరలో విదేశీ విమానాల రాకపోకల్ని పాక్షికంగా పునరుద్ధరించబోతోంది. ఇందులో భాగంగా విజయవాడకు కూడా నేరుగా విదేశీ విమానాల్ని అనుమతించాలని నిర్ణయించారు. ప్రస్తుతం భారత్‌లో కరోనా వ్యాప్తి కారణంగా పలు దేశాలు విమాన సర్వీసులు రద్దు చేసుకోగా.. భారత్‌ కూడా విదేశీ విమానాలను అనుమతించడం లేదు. కానీ వందే భారత్‌ కార్యక్రమం కింద విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కి తీసుకురానున్నారు.

వాస్తవానికి కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో విదేశాల నుంచి భారత్‌కు వచ్చే విమానాలు నిలిచిపోయాయి. దీంతో విజయవాడలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి అడపాదడపా దేశీయ సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. కానీ అంతర్జాతీయ విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో విజయవాడ విమానాశ్రయం కళతప్పింది. ఇప్పుడు వందే భారత్‌ మిషన్‌ కింద పాక్షికంగా స్పెషల్‌ సర్వీసులు ప్రారఁభమవుతున్నా ఢిల్లీ, చెన్నై వంటి విమానాశ్రయాలకే ఈ రాకపోకలు ఉంటాయని భావించారు. కానీ విజయవాడకు కూడా నేరుగా వందే భారత్‌ విమానాల్ని అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది.

vande bharat mission : direct foreign flights from and to vijayawada from june 2nd

Recommended Video

Chandrababu Naidu CM అవ్వాలంటే | Ys Jagan సక్సెస్ మంత్రా ! || Oneindia Telugu

కరోనాకు ముందు విజయవాడ ఎయిర్‌పోర్టుకు విదేశీ విమానాల రాకపోకలు సాధారణంగా ఉండేవి. అప్పట్లో సింగపూర్‌తో పాటు దుబాయ్‌, ఇతర దేశాలకు రెగ్యులర్‌గా విమానాలు ఉండేవి. కరోనా వ్యాప్తి తర్వాత విదేశీ విమానాలు తగ్గిపోవడం, దేశీయ సర్వీసుల్లో వచ్చే ప్రయాణికులకు కూడా కరోనా టెస్టులు నిర్వహిస్తుండటంతో రాకపోకలు భారీగా తగ్గిపోయాయి. ఇప్పుడు వందే భారత్‌ మిషన్‌ కింద తిరిగి నేరుగా విమానాలు అనుమతిస్తున్నారు. అయితే కరోనా టెస్టులు మాత్రం తప్పనిసరిగా నిర్వహిస్తారు. పాజిటివ్‌గా తేలితే క్వారంటైన్‌లో ఉంచి చికిత్స తీసుకున్నాకే పంపుతారు.

English summary
direct foreign flight services to vijayawada airport will be resumed from june 2 as a part of union government's vandebharat mission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X