రోజాను అనుమతిస్తారా?: సారీ చెప్పింది కానీ.. వంగలపూడి అనిత ఆవేదన
అసెంబ్లీ సమావేశాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను అనుమతించాలా? లేదా? అనే అంశంపై గురువారం నాడి కేబినెట్ భేటీలో చర్చ జరిగింది.
విజయవాడ: అసెంబ్లీ సమావేశాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను అనుమతించాలా? లేదా? అనే అంశంపై గురువారం నాడి కేబినెట్ భేటీలో చర్చ జరిగింది.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రోజా పైన విధించిన ఏడాది సస్పెన్షన్ గడువు పూర్తయిందని, ఈ నేపథ్యంలో శాసనసభ సమావేశాలకు ఆమెను అనుమతించాలా? వద్దా? అన్న విషయంలో వ్యూహ కమిటీ సమావేశంలో చర్చ జరిగింది.

దీనిపై వంగలపూడి అనిత జోక్యం చేసుకుంటూ.. క్షమాపణ కోరుతూ రోజా లేఖ రాసినా, ఆమెలో పశ్చాత్తాపం కనిపించడం లేదని, రోజా తనకు వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పాల్సిందేనని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. అయితే, సమావేశాలు మొదలయ్యాక దీని గురించి మాట్లాడుదామని చంద్రబాబు చెప్పారని తెలుస్తోంది.
కాగా, తనకు వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పాల్సిందేనని అనిత వ్యాఖ్యానించడంపై రోజా శుక్రవారం నాడు స్పందించారు. తనను తిడితేనే పదవులు వస్తాయని అనిత భావించడం బాధాకరమన్నారు. గతంలో టిడిపిలో తనకు ఎదురైన పరిస్థితులే రేపు అనితకు ఎదురవుతాయన్నారు.
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు పైన పరుష వ్యాఖ్యలు చేశారనే కారణంతో రోజా పైన ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేశారు. ఆమె పైన సస్పెన్షన్ గడువు ముగిసింది. దీంతో ఆమెను అసెంబ్లీలోకి అనుమతిస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!











Click it and Unblock the Notifications